Andhra: అర్ధరాత్రి అలికిడి.. ఏముందో అని చూడగా గుండె గుభేల్‌

బాపట్ల జిల్లా అద్దంకి పట్టణం సమీపంలోని గుండ్లకమ్మ నది నుంచి బయటకు వచ్చిన ఓ కొండ చిలువ కలకలం రేపింది. అద్దంకి - దర్శి రోడ్డులో జనావాసాల్లోకి అర్ధరాత్రి కొండచిలువ రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

Andhra: అర్ధరాత్రి అలికిడి.. ఏముందో అని చూడగా గుండె గుభేల్‌
Python News

Edited By: Ravi Kiran

Updated on: Dec 01, 2025 | 2:07 PM

భారీ వర్షాలకు కొండ చిలువలు తమ ఆవాసాలను వీడి జనావాసాలకు వస్తున్నాయి… ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, కాలువ ప్రాంతాల్లో ఉంటున్న కొండచిలువలు సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నాయి. అలా వచ్చిన వాటిల్లో కొన్నిజనావాసాల్లోకి వస్తుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు… గ్రామాల్లోకి వస్తున్న కొండచిలువలు గొర్రెలు, మేకలను తినేస్తాయన్న భయంతో రాత్రిళ్ళు వాటికి కాపలా కాస్తున్నారు. తాజాగా బాపట్లజిల్లా అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నది నుంచి ఓ కొండచిలువ గ్రామంలోకి రావడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.

బాపట్ల జిల్లా అద్దంకి పట్టణం సమీపంలోని గుండ్లకమ్మ నది నుంచి బయటకు వచ్చిన ఓ కొండ చిలువ కలకలం రేపింది. అద్దంకి – దర్శి రోడ్డులో జనావాసాల్లోకి అర్ధరాత్రి కొండచిలువ రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నారు. పట్టుకున్న కొండ చిలువను సమీప అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నదీప్రాంతాల్లో నివాసం ఉంటున్న కొండచిలువలకు తమ ఆవాసాలు నివాసయోగ్యంగా లేకపోవడం, ఆహారం దొరక్కపోవడంతో సమీప గ్రామాల్లోకి వస్తున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొండ చిలువలు గ్రామాల్లోకి ప్రవేశించి మేకలు, కోళ్లను మింగేస్తాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు పడే సమయంలో నదులు, కాలువ పక్కన గ్రామస్థులు తమ జీవాలను కాపాడుకునేందుకు కాపలా కాయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.