
ఈమధ్య చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సెల్‌ఫోన్లలో రీల్స్ చూడటంలో మునిగిపోయి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. నిజంగానే ఒక్కోసారి రీల్స్ మాయలో పడి గంటల గంటలు టైం కూడా తెలియడం లేద.. అలాగే ఓ విద్యార్థిని తన తండ్రి సెల్‌ఫోన్‌లో రిల్స్ చూడొద్దన్నందుకు ఊహించని పని చేసింది. హిందూపురం పట్టణంలోని సత్యనారాయణపేటకు చెందిన భాను తేజ (19) ప్రైవేట్ కళాశాలలో బిబిఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది… నిత్యం సెల్‌ఫోన్‌లో మునిగిపోయి… పగలు, రాత్రి తేడా తెలియకుండా గంటలకు గంటలు రీల్స్ చూస్తుంది. పుస్తకం ముందు పెట్టుకుని కూడా ఫోన్ యూజ్ చేస్తుంది. దీంతో తండ్రి మొబైల్‌లో రీల్ చూడటం మానేసి బుద్ధిగా చదువుకోమని కొంచెం గట్టిగానే మందలించాడు. మొబైల్ ఫోన్ చూడొద్దని మందలించిన మిమ్మల్ని ఏడిపిస్తాను చూడండి అంటూ… భాను తేజ బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో తన గదిలోకి వెళ్లి… తలుపు గడియ పెట్టుకుని ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికి తలుపులు తెరవకపోవడంతో… తలుపులు పగలగొట్టి… ఉరి వేసుకొని వేలాడుతున్న భానుతేజను తల్లిదండ్రుల ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని భాను తేజ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్న చిన్న కారణాలకు కూడా ఇవాళ యువత చావు ఒక్కటే పరిష్కారం అనుకుని… తనువు చాలిస్తున్నారు. విద్యార్థిని భానుతేజ కూడా… మొబైల్‌లో రీల్స్ చూడొద్దు చదువుకోమన్నందుకు… తండ్రి మాటలను కూడా తప్పుగా అర్థం చేసుకుని క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేంత కఠిన నిర్ణయం తీసుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి