Kachidi Fish: తూర్పుగోదావరి జిల్లా(East Godavari district)కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో స్థానిక మత్స్యకారుల వలలో 30 కిలోల పైనే మగ కచ్చిడి చేప చిక్కింది. దీన్ని స్థానిక ఫిషింగ్ హార్బర్‌లో వేలం వేయగా రూ.4.60 లక్షలకు స్థానిక వ్యాపారి రత్నం కొనుగోలు చేశారు. అరుదుగా చిక్కే ఈ చేపలను కలకత్తా(Kolkata)కు ఎగుమతి చేస్తామని వ్యాపారి తెలిపారు. మగ చేప మాత్రమే అంత విలువ ఉంటుందని, ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని, మత్స్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారట. అరుదుగా లభించే ఈ కచ్చిడి చేపను వేలంలో దక్కించుకునేందుకు వ్యాపారస్తులు ఎగబడ్డారు. సముద్రంలో చాలా అరుదుగా కచ్చిడి చేపలు దొరకుతాయని మత్సకారులు తెలిపారు. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికనట్టే అని చెబుతారు. ఒక్కటి వలలో చిక్కినా తమ పంట పండినట్టే అని చెబుతుంటారు. కాగా ఈ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది.
ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ లక్కి ఫిష్ శరీర భాగాలను వినియోగిస్తుంటడంతో గోల్డ్‌ఫిష్ మరింత కాస్ల్టీగా మారిపోయింది. ఈ చేపలు దొరకాలంటే మత్స్యకారుల లక్ తిరగాల్సిందే. మార్కెట్‌లో సూపర్ ధర పలుకుతున్న ఈ చేపను ప్రొటోలిసియా డయాకాన్సన్ అనే సాంకేతిక నామంతో పిలుస్తుంటారు. మొత్తంగా చేపలందు కచిడి చేపలు వేరయ్యా!
Also Read: Nellore District: అతడో హెడ్ కానిస్టేబుల్.. ఏం స్మగ్లింగ్ చేస్తున్నాడో తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సరయుపై కేసు నమోదు.. ఎందుకంటే