Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ మండలాల్లో పిడుగులు పడే ఛాన్స్.. జాగ్రత్త

| Edited By: Venkata Chari

May 24, 2023 | 5:06 PM

ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.

Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ మండలాల్లో పిడుగులు పడే ఛాన్స్.. జాగ్రత్త
Lightning Strike
Follow us on

ఏపీలోని ప్రజలకు అలెర్ట్. పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదని హెచ్చరించింది. సాధారణ ప్రజలు సైతం బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తులు నిర్వహణ సంస్థ సూచించింది.

శ్రీకాకుళం జిల్లా:   ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లో పిడుగులు పడే అవకాశం

పార్వతీపురం మన్యం జిల్లా:  గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం బ

అల్లూరి సీతారామరాజు జిల్లా: అనంతగిరి, అరకులోయ, జీకే వీధి, కొయ్యూరు మండల్లాలో పిడుగులు పడే అవకాశం

ఇక నైరుతి రుతుపవనాలు రాగల 2 రోజులలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.  ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో నైరుతి గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————–

బుధవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.  ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది .

గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది .

శుక్రవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
———————–

బుధవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది .

గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది.

శుక్రవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :-

—————-

బుధవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది .

గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది .

శుక్రవారం:-  వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుండి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం