AP Rains: పిడుగు పడేసిన వాతావరణ శాఖ.. అక్కడక్కడ చెదురుమదురుగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు

ఏపీలో 15 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్..11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ కేంద్రం. కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. మరోవైపు తెలంగాణలోని వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

AP Rains: పిడుగు పడేసిన వాతావరణ శాఖ.. అక్కడక్కడ చెదురుమదురుగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు
North West Monsson

Updated on: Jun 12, 2025 | 9:03 PM

ఉత్తర కోస్తాంధ్ర, ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని నుండి ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

శుక్రవారం(13-06-25): పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం(14-06-25): అల్లూరి సీతారామరాజు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

శుక్రవారం సాయంత్రం 7 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో 64.5మిమీ, పల్నాడు జిల్లా మాచర్లలో 61.7మిమీ, కాకాణిలో 55మిమీ, చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో 54మిమీ, తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో 47.5మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదయిందని తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us