Andhra: ఆంధ్రాలో వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు వెదర్ వార్నింగ్.. తాజా రిపోర్ట్

ఒకవైపు వర్షాలు, మరోవైపు వడగాల్పులు.. ఏపీలో పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితి ఇది. వడగాల్పుల నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది విపత్తుల నిర్వహణ శాఖ. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 41- 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందట.

Andhra: ఆంధ్రాలో వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు వెదర్ వార్నింగ్.. తాజా రిపోర్ట్
Ap Weather

Updated on: May 11, 2025 | 7:48 AM

ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. శనివారం రేణిగుంటలో 41.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 41- 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 81 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శనివారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.7°C, విజయనగరంలో 41.1°C, తూర్పుగోదావరి జిల్లా మురమండలో 41°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40.8°C, వైఎస్సార్ జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 40.7°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 41- 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు-11, అనకాపల్లి జిల్లా-8 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 30 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. సోమవారం 24 మండలాల్లో తీవ్ర వడగాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపిన ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే సోమవారం అల్లూరి సీతారామరాజు-8, అనకాపల్లి-16, అనంతపురం-4, అన్నమయ్య-1, చిత్తూరు జిల్లా కుప్పం మండలాల్లో(30) వడగాలులు వీస్తాయని తెలుస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆదివారం రాష్ట్రంలోని పలు చోట్ల బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందట. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us