రుతుపవనాలు ఆలస్యం కావడం వల్ల ఈసారి వర్షపాతం లోటు పెరగనుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం, అలాగే అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణం కనిపిస్తుందని.. దాని ప్రభావంతో ఇక్కడ తేమ అటువైపు వెళ్లడంతో ఎండ ప్రభావం మరింతగా కనిపిస్తుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రుతుపవనాలు ఎంటర్ అయ్యేవరకు మాడు పగిలే ఎండలు ఏపీలో తప్పేలా లేవు.
నైరుతి రుతుపవనాలు రావడం ఆలస్యం కావడంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండతీవ్రత ఎక్కువగా ఉండనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అన్నారు. ఈరోజు 21 మండలాల్లో వడగాల్పులు ఏపీ వ్యాప్తంగా వీచాయి. ఈరోజు అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.3 డిగ్రీలు నమోదైంది. ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా గొల్లగుంటలో 42.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కాజాలో 42.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జూన్ 6న – అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 – 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39 – 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవొచ్చునని అన్నారు
జూన్ 7న – అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య ,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C – 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
జూన్ 8న – శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C – 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.