ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దుగ్గిరాల, రేపల్లె ఘటనలు మరవకముందే విజయనగరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు కొట్టి మరీ దాడికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు రాగా.. ఒకరే అత్యాచారం చేశారని, అతనిని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. పార్వతీపురం(Parvathipuram) మన్యం జిల్లాకు చెందిన ఓ మహిళ బతుకుదెరువు కోసం విజయనగరంలోని ఉడా కాలనీకి వచ్చింది. అక్కడే ఓ టీ దుకాణంలో పని చేసుకుంటూ జీవిస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపు కొట్టారు. తలుపు తీయగానే బలవంతంగా లోపలికి చొరబడి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంపై బాధితురాలు విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు.
బాధితురాలు తన స్నేహితునితో ఇంట్లో ఉన్న సమయంలో అక్కడికి ఇద్దరు యువకులు వచ్చారని, వారిలో ఒకరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారని వెల్లడించారు. నిందితుడు విజయనగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని వివరించారు. ఏడు రోజుల్లో ఛార్జ్‌షీట్ తయారు చేస్తామని, దిశ పోలీస్‌స్టేషన్‌లోనే కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పారుఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Spices To Avoid In Summer: వేసవిలో ఈ 4 మసాలాలు తినడం ప్రమాదమే..! అవేంటో తెలుసుకోండి
Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..