Andhra: జడ్పీటీసీ ఎన్నికల బరిలో రూ.172 కోట్ల ఆస్తుల అభ్యర్థిని!

గుడిపాల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమత శ్రీ కుటుంబానికి రూ.172.27 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడైంది. 44.62 ఎకరాల వ్యవసాయ భూమి, కోట్ల విలువైన భవనాలు, బంగారం, వెండి, వాహనాలు ఆస్తుల జాబితాలో ఉన్నాయి. భార్యాభర్తల పేరిట రూ.32 కోట్ల రుణాలున్నట్లు పేర్కొన్నారు.

Andhra: జడ్పీటీసీ ఎన్నికల బరిలో రూ.172 కోట్ల ఆస్తుల అభ్యర్థిని!
Mamata Sri - Mogileswara Naidu

Updated on: Oct 30, 2026 | 8:07 AM

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. చిత్తూరు జిల్లా గుడిపాల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న మమత శ్రీ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తుల విలువ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమెతో పాటు కుటుంబసభ్యుల పేరిట మొత్తం రూ.172.27 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరోవైపు భార్యాభర్తలిద్దరి పేరిట కలిపి రూ.32 కోట్ల రుణాలు ఉన్నట్లు వెల్లడించారు.

భూములు, భవనాలే అధికం

కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తుల్లో స్థిరాస్తుల వాటా ఎక్కువగా ఉంది. వ్యవసాయ భూములు, నివాస భవనాలు ఈ జాబితాలో ప్రధానంగా ఉన్నాయి. మొత్తం 44.62 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అఫిడవిట్‌లో వివరించారు. వీటితో పాటు రూ.24.89 కోట్ల విలువైన ఇళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంతో పాటు కర్ణాటకలోనూ కుటుంబానికి ఆస్తులున్నట్లు మమత శ్రీ వెల్లడించారు.

బంగారం, వెండి.. వాహనాలు

చరాస్తుల వివరాల్లోనూ పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. మమత శ్రీ పేరిట రెండు స్కూటీలు ఉండగా, ఆమె వద్ద 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె భర్త మొగిలీశ్వర నాయుడు (ఈశ్వర నాయుడు) పేరిట మూడు సరకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటితో పాటు మరో మూడు కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు కూడా ఆయన పేరుపై ఉన్నట్లు వెల్లడించారు.

ఆస్తులతో పాటు అప్పుల వివరాలు

అఫిడవిట్‌లో చూపిన లెక్కల ప్రకారం కుటుంబానికి మొత్తం రూ.9.28 కోట్ల చరాస్తులు, రూ.162.99 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఈ రెండింటి విలువ కలిపి రూ.172.27 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఆస్తులతో పాటు అప్పుల వివరాలను కూడా అభ్యర్థి వెల్లడించారు. భార్యాభర్తలిద్దరి పేర్లపై కలిపి రూ.32 కోట్ల రుణాలున్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఎన్నికల వేళ అభ్యర్థి కుటుంబ ఆస్తులు, అప్పుల వివరాలు చర్చనీయాంశంగా మారాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us