Saree Cake: పచ్చని రంగు పట్టు చీర, బంగారు ఆభరణాలతో కేక్.. ఎంగేజ్ మెంట్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్..

|

Apr 01, 2022 | 11:45 AM

Saree Cake: ఆతిథ్యం, పండగలు, శుభకార్యాలు ఏవైనా సరే గోదావరి జిల్లాల (Godavari District)స్పెషాలిటీనే వేరు. గోదావరి జిల్లా వాసులు అనురాగానికే కాదు, ఆప్యాయతకు కేరాఫ్ అడ్రస్. కీర్తి ప్రతిష్టలకు ఫేమస్...

Saree Cake: పచ్చని రంగు పట్టు చీర, బంగారు ఆభరణాలతో కేక్.. ఎంగేజ్ మెంట్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్..
Saree Cake 1
Follow us on

Saree Cake: ఆతిథ్యం, పండగలు, శుభకార్యాలు ఏవైనా సరే గోదావరి జిల్లాల (Godavari District)స్పెషాలిటీనే వేరు. గోదావరి జిల్లా వాసులు అనురాగానికే కాదు, ఆప్యాయతకు కేరాఫ్ అడ్రస్. కీర్తి ప్రతిష్టలకు ఫేమస్. గోదావరి జిల్లా వాసులు వెటకారంలోనే కాదు మమకారంలోనూ తగ్గేదెలే అంటారు గోదారోళ్లు. ముఖ్యంగా కోనసీమలో ఆతిధ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక తమ ఇంటికి వచ్చే అల్లుళ్ళకు ఇచ్చే గౌరవం, కోడళ్ళకు పంపే సారే ఇవన్నీ వెరీ వెరీ స్పెషల్. ఆషాడంలో వియ్యంకుడు పంపిన సారెకు దిమ్మతిరిగే రేంజ్‌లో శ్రావణ మాసంలో కోడలికి సారే పంపిన వియ్యండుకు. సంక్రాంతి పండుగ‌కు వ‌చ్చే అల్లుళ్ల కు పండగ పూట ఇచ్చే ఆతిథ్యం ర‌క‌ర‌కాల నోరూరించే పిండి వంట‌లు, స్వీట్లు, కోడి మాంసం, సీఫుడ్స్ తో అతిదిమర్యాదలు అన్నీ వెరీ వెరీ స్పెషల్.. అయితే తాజాగా అమలాపురంలో నిశ్చితార్ధం వేడుక సమయంలో తీసుకుని వెళ్ళిన స్వీట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. వీటిల్లో అతిధులను, ఆహుతులను ఆకట్టుకుంది ఓ వైరైటీ కేక్..

Saree Cake

అందమైన చీర కనిపిస్తే.. వెంటనే మహిళలు తన సొంతం చేసుకోవాలని.. కట్టుకోవాలని కోరుకుంటారు. అయితే ఈ ఎంగేజ్ మెంట్ వేడుకలోని ఓ అందమైన చీరను మాత్రం కట్టుకోలేరు.. జస్ట్ ముక్కలు ముక్కలుగా చేసి తింటారు అంతే..

అమలాపురంలో ఓ ఇంట వివాహనిశ్చితార్థ వేడుకకోసం తీసుకెళ్ళే స్వీట్స్ లో భాగంగా ఒక అందమైన పట్టు చీర ఆకృతిలో కేకు తయారు చేయించారు. ఈ వేడుకలో పట్టుచీర కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోనసీమ అందాలను తలపిస్తూ.. పచ్చ రంగు.. ఎరుపు రంగు అంచు ఉన్న పట్టు చీర..కేక్.. దాని మీద అదనపు హంగులుగా బంగారు నగలు, గాజులు, నక్లెస్, కుంకుమ భరిణ వంటి వస్తువులను టాపింగ్ చేసి.. కేక్ పై అందంగా అమర్చారు. చూపరులకు అది కేక్ లేక పట్టుచీర అనే విధంగా అలంకరించారు. ఈ పట్టుచీర కేక్ నిశ్చితార్ధం వేడుకల్లోని స్వీట్లలో ప్రత్యేకంగా నిలిచింది. ఫంక్షన్ కు వచ్చిన మహిళలే కాదు.. మగవారు కూడా ఈ కేక్ ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.

Also Read:

Andhra Pradesh: అప్పు చేసి పంట వేసిన అన్నదాత.. నష్టాలు రావడంతో ఆత్మహత్య

Corona Virus: కరోనాతో భర్తను పోగొట్టుకున్న బామ్మ.. తోటివారికి సాయం కోసం పచ్చళ్ల తయారీ.. పదిమందికి సాయం