Free Sand Scheme: ఉచిత ఇసుక సరఫరాపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఖర్చుల భారాన్ని తగ్గించేలా..

|

Sep 15, 2024 | 9:19 PM

ఉచిత ఇసుక సరఫరాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ.. టారిఫ్‌ను ఫిక్స్ చేస్తూ జీవో విడుదల చేసింది.

Free Sand Scheme: ఉచిత ఇసుక సరఫరాపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఖర్చుల భారాన్ని తగ్గించేలా..
Free Sand Scheme
Follow us on

ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేలా చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉచిత ఇసుక రవాణా ఛార్జీల నియంత్రణపై ప్రభుత్వం కసరత్తు చేసింది. రాష్ట్రం అంతటా ఒకే రకమైన రవాణా ఛార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ టారిఫ్ ను ఫిక్ చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఇసుక రవాణా వాహనాల యజమానులతో సమావేశం అనంతరం రవాణా ఛార్జీల టారిఫ్‌ను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. 10 కిలోమీటర్లు వరకు ట్రాక్టర్ కు కిలోమీటర్‌కు టన్‌కి 13.5 రూపాయలు వసూలు చేయాలని సూచించింది. అది 4.5 టన్‌ల వరకు వినాహాయింపు ఇచ్చింది.

ఇక ఆరు టైర్ల ట్రక్‌కు కిలోమీటర్‌కి టన్‌కు 10 రూపాయల 70పైసలు 10 టన్‌ల వరకు వసూలు చేయాలని సూచించింది. 10లేదా 12లేదా 14 టైర్ ట్రక్ కు కిలోమీటర్‌కి టన్ కు 9.40 రూపాయలు.. 35 టన్నుల వరకు వసూలు చేయాలని చెప్పింది. అలాగే ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ చేసుకున్నప్పుడే.. ఇంటి వద్దకు డెలివరీ కావాలనుకునే వాళ్లు ఆప్షన్‌ ఇస్తే, లారీలో ఇసుక సరఫరా చేయనున్నారు.

ఇందులో భాగంగా రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు ఇసుక రవాణా చేసేందుకు ఆసక్తి ఉన్న లారీల యజమానులు.. గనులశాఖ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశించారు. దీంతో అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటికి 3 వేల లారీల యజమానులు తమ వాహనాల వివరాలను నమోదు చేసుకున్నారు. ఇవన్నీ జీపీఎస్‌ ఉన్నవి కావడంతో.. ఇసుక దారిమళ్లకుండా నిఘా నీడలో సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..