AP Employees: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు

|

Apr 21, 2022 | 4:50 PM

AP Employees: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం మళ్లీ ..

AP Employees: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు
Follow us on

AP Employees: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ఏపీపీఎస్‌సీకి (APPSC) సిఫార్సు చేస్తామని వైఎస్ జగన్‌ ప్రభుత్వం  (YS Jagan Government)వెల్లడించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయల శాఖ ప్రత్యేక కార్యదర్శఙ అజయ్ జైన్‌ తమకు హామీ ఇచ్చారని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జానీప్రకటన చేశారు. అయితే తమ ఉద్యోగుల సమాఖ్య తరపున అజయ్‌ జైన్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతులు కూడా అందజేసినట్లు తెలిపారు.

ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షల్లో ప్రశ్న పత్రాలు కాస్తా కఠినంగా ఉన్నాయని, పేపర్‌ కోడ్‌ 8, 10 లో అర్హత మార్కులు 40 కి బదులుగా 25కి తగ్గించాలని కూడా కోరినట్లు చెప్పుకొచ్చారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని1750 మంది గ్రేడ్‌ 5 కారదర్శుల ప్రొబేషన్‌ కు సంబంధించిన పరీక్ష కూడా మరోసారి నిర్వహించాలని కోరామన్నారు. జూన్‌ 30 లోగాఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తమకు తెలియజేశారని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

AP News: భూ అక్రమ కేసులో తహసీల్దార్‌ను శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..!

Queen Elizabeth: రెండేళ్ల వయసు నాటి ఎలిజబెత్‌ రాణి ఫోటో.. 96వ పుట్టిన రోజున షేర్‌ చేసిన బ్రిటన్‌ క్వీన్‌