Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..

తూర్పు గోదావరి జిల్లాలో ఓ భారీ కొండ చిలువ కలకలం రేపింది. తాళ్లరేవు మండలం గోవలంక ఏటిగట్టు రోడ్డుకు అడ్డంగా కొండ చిలువ తిష్టవేసి హల్‌చల్ చేసింది.. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. ఈ క్రమంలోనే.. కొండచిలువ రోడ్డు పై ఉండగా.. ఓ వ్యక్తి దానిపై కర్రతో ఎటాక్ చేశాడు.. దీంతో కొండ చిలువ తిరగబడింది..

Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..
Python Video

Updated on: Sep 21, 2025 | 1:37 PM

తూర్పు గోదావరి జిల్లాలో ఓ భారీ కొండ చిలువ కలకలం రేపింది. తాళ్లరేవు మండలం గోవలంక ఏటిగట్టు రోడ్డుకు అడ్డంగా కొండ చిలువ తిష్టవేసి హల్‌చల్ చేసింది.. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. ఈ క్రమంలోనే.. కొండచిలువ రోడ్డు పై ఉండగా.. ఓ వ్యక్తి దానిపై కర్రతో ఎటాక్ చేశాడు.. దీంతో కొండ చిలువ తిరగబడింది.. ఈ భయంకరమైన సీన్ చేసి.. అక్కడున్నవారంతా పరుగులు తీశారు. అయితే.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. యానాం నుంచి జొన్నడా వెళ్లే గోవలంక వద్ద ఏటిగట్టు రోడ్డుపై రాత్రి వేళ ఓ భారీ కొండ చిలువ తిష్టవేసింది. రోడ్డుపై దారికి అడ్డంగా ఎటు కదలకుండా అలానే ఉండిపోయింది.. రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ కొండచిలువను చూసిన ప్రయాణికులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.. ఇలా చాలా సేపు కొండ చిలువ రోడ్డుకు అడ్డంగానే ఉండిపోయింది..

అయితే.. దారికి అడ్డంగా ఉన్న కొండ చిలువపై స్థానికులు కర్రలతో దాడి చేశారు.. దీంతో కొండచిలువ అకస్మాత్తుగా స్థానికులపై తిరగబడింది.. దీంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. అయితే.. స్థానికుల దాడితో కొండచిలువ ప్రక్కనే ఉన్న పొదలలోకి వెళ్లిపోయింది. అనంతరం ప్రయాణికులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..