Andhra Pradesh: ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. టైరు పేలడంతో అదుపు తప్పిన బస్సు.. నలుగురికి గాయాలు
ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురైంది. నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే బస్ డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కకు తిప్పి బస్సులో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులను కాపాడాడు. గాయపడిన వారిని 108లో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
బస్సు రన్నింగ్ లో ఉంది.. సడెన్ గా పెద్ద శబ్దంతో టైరు పేలింది. ఇంకే ముంది బస్సు అదుపు తప్పి సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఖంగారుపడ్డారు. డ్రైవర్ మాత్రం చాకచక్యంగా రోడ్డు పక్కన బస్సు నిలపడంతో ప్రమాదం తప్పింది. ఉమ్మడి అనంత పురం జిల్లాలోని ఘోర ప్రమాదం తప్పింది. ఓబులదేవర చెరువు సమీపంలో కదిరి, హిందూపురం ఆర్టీసీ సర్వీస్ బస్సు టైరు పేలింది. దీంతో ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురైంది. నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే బస్ డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కకు తిప్పి బస్సులో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులను కాపాడాడు. గాయపడిన వారిని 108లో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఒక్క క్షణం ఏం జరుగుతుంది బస్ లో ఉన్న ప్రయాణికులకు అర్ధం కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..