Four held for theft of cars: వాళ్లు మామూలు దొంగలు కాదు, గజదొంగలకే చోరకళ నేర్పించగల హైటెక్ కేటుగాళ్లు. పోలీసులు సైతం ఆశ్చర్యపోయేలా చోరీలు చేయగల దొంగలు వాళ్లు.. వాళ్లే అమ్ముతారు, మళ్లీ వాళ్లే ఎత్తుకుపోతారు.. అలాంటి కేటుగాళ్లకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లో వెరైటీ (Annamayya district) దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. వాళ్లు, అలాంటిలాంటి దొంగలు కాదు, టెక్నాలజీని నైస్‌గా వాడుకునే హైటెక్ దొంగలు. వీళ్లు కేవలం జీపీఎస్ ఉన్న కార్లను మాత్రమే దొంగలిస్తారు. ఈ కార్ల చోరీల్లో మరో అద్భుతమైన ట్విస్ట్ కూడా ఉంది. వీళ్లే ఆ కార్లను అమ్ముతారు, లేదా డబ్బు అవసరం ఉందంటూ కుదువ పెడతారు. మళ్లీ వాళ్లే ఓనర్‌కు తెలియకుండా ఎత్తుకుపోతారని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ తెలిపారు.
ముందు కాస్ట్లీ కార్లను అద్దెకు తీసుకుంటారు. ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ కార్లకు ఓనర్స్‌మని నమ్మిస్తారు. కుదిరితే అమ్మేస్తారు, లేదంటే డబ్బు అవసరం ఉందంటూ తాకట్టు పెడతారు. జీపీఎస్ ఆధారంగా కారు ఎక్కడుందో తెలుసుకుని, సెకండ్ కీతో ఎత్తుకుపోతారు. ఇలా, కేటుగాళ్లు ఐదు కోట్ల రూపాయలు కొట్టేశారని తెలిపారు.
మొత్తం నలుగురు దొంగలను అరెస్ట్ చేసిన మదనపల్లి టూటౌన్ పోలీసులు, వాళ్ల దగ్గర్నుంచి 9 కాస్ట్లీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు కార్ల రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ హైటెక్ దొంగల్లో ఇద్దరు తెలంగాణ వాసులు కాగా, మరో ఇద్దరు కడప జిల్లా వాసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: