Train Accident: విశాఖపట్నం – కిరండూల్ పాసింజర్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం.. అసలేంజరిగిందంటే..

విశాఖపట్నం - కిరండూల్ పాసింజర్ రైలుకు సోమవారం (సెప్టెంబర్‌ 12) కొద్దిలో ప్రమాదం తప్పింది.

Train Accident: విశాఖపట్నం - కిరండూల్ పాసింజర్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం.. అసలేంజరిగిందంటే..
Train Derailed

Updated on: Sep 12, 2022 | 6:03 PM

Visakhapatnam – Kirandul Special passenger train: విశాఖపట్నం – కిరండూల్ పాసింజర్ రైలుకు సోమవారం (సెప్టెంబర్‌ 12) కొద్దిలో ప్రమాదం తప్పింది. ఒరిస్సాలోని జైపూర్ – చిత్రికూట్ వద్ద కేకే లైన్లో ఛత్రిపుట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పాసింజర్ రైలుకు చెందిన 4 బోగాలు పట్టాల మీద నుంచి కిందికి దిగాయి. ట్రైన్ నెంబర్‌ 08551తో ఉన్న విశాఖపణం-కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్‌ రైలు కోరాపుట్ నుంచి కిరండూల్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. జైపూర్‌ స్టేషన్‌ దాటిన తర్వాత ఒక స్లీపర్‌, మూడు జనరల్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. వెంటనే స్పందించిన సిబ్బంది రైలును ఆపుచేసి, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ అనుప్‌ సత్పతి తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us