
Jeelugu Kallu: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) తూర్పుగోదావరి (East Godavari District)జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ జీలుగు కల్లు త్రాగి ఐదుగురు మరణించారు. ఈ విషాద ఘటన రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డి గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. తమ గ్రామంలో లభించే కల్లును ఎప్పటిలాగే ఈ ఐదుగురు గిరిజనులు తాగారు. అయితే ఆ కల్లు వికటించింది. వెంటనే స్థానికులు స్పందించి బాధితులను సమీపంలోని జడ్డంగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఒకరు మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అడ్డతీగల పిహెచ్ సికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరో నలుగురు గిరిజనులు మరణించారు. కల్తీ కల్లుతాగి ఒకేసారి ఐదుగురు మరణించడంతో లోదొడ్డి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ గిరిజనుల మరణానానికి కారణం కల్తీ కల్లు ఏనా.. లేక ఎవరైనా కల్లు లో ఏమైనా కలిపారా.. ఏదైనా ఇతరకరణాలున్నాయా వంటి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: