Eluru Fire Accident: దేవుడి దగ్గర వెలిగించిన దీపం.. ఎలుక తెచ్చిన తిప్ప‌లు..! ఐదు ఇళ్లు అగ్నికి ఆహుతి

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. దేవుడి దగ్గర వెలిగించిన దీపం కిందపడి ఇంటికి మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో

Eluru Fire Accident:  దేవుడి దగ్గర వెలిగించిన దీపం.. ఎలుక తెచ్చిన తిప్ప‌లు..! ఐదు ఇళ్లు అగ్నికి ఆహుతి
fire accident

Updated on: May 23, 2021 | 4:53 PM

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. దేవుడి దగ్గర వెలిగించిన దీపం కిందపడి ఇంటికి మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో మరో  4 ఇళ్లకు మంటలు అంటుకుని దగ్ధమైన షాకింగ్ ఘటన క‌ల‌కలం రేపింది. ఏలూరు మండలం మాదేపల్లి పంచాయతీ గురుకులపేటలో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏటి గట్టుపై ఉన్న ఐదు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో వెలిగించిన దీపం కిందపడి జమ్ముతో ఏర్పాటు చేసిన దడికి అంటుకుని మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే పక్క ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో వారంతా పనులకు వెళ్లడంతో ఇళ్లతో.. లోప‌లి వ‌స్తువులు మంటల్లో కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు.

అయితే దీపం కిందపడి మంటలు అంటుకోవడానికి ఓ ఎలుక కారణమని.. ఎలుక తగిలి దీపం కిందపడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కెల్లా అప్పలనాయుడు, కెల్లా శాంతమని, వరదుల సుబ్బారావు, తులసి, వరలక్ష్మికి చెందిన ఐదు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయ‌ని అధికారులు గుర్తించారు. తాము క‌ట్టు బట్ట‌ల‌తో రోడ్డుపై ప‌డిపోయామ‌ని.. ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. చీక‌ట్లో దీపం ఇంట్లో వెలుగులు నింపుతుంది. కానీ నిర్ల‌క్ష్యంగా ఉంటే ఆ ఇంటిని కాల్చి బుగ్గి చేస్తుందనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు స్థానికులు.

Also Read: ఓ రోగికి అత్య‌వ‌స‌ర మెడిసిన్ అందించేంద‌కు రోడ్డుపైకి హీరో నిఖిల్.. అడ్డుకున్న పోలీసులు.. చివ‌ర‌కు

ఆనందయ్యది ఆయుర్వేదమా? నాటు మందా?.. ఆయుష్ కమిషనర్ క్లారిటీ

Loading...
Unable to load recommendations.
Follow Us