Andhra Pradesh: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. క్షణాల్లో దగ్ధం.. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు

ఇంజిన్‌ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌.. అప్రమత్తమై బస్సును నిలిపేశారు. వెంటనే ప్రయాణికులు, విద్యార్థులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. సాంకేతిక లోపంతోనే బస్సులో మంటలు చెలరేగి ఉంటాయంటున్నారు అధికారులు.

Andhra Pradesh: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. క్షణాల్లో దగ్ధం.. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు
Fire Accident

Updated on: Oct 21, 2022 | 1:00 PM

కృష్ణాజిల్లా పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విజయవాడ నుండి గుడివాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిసి మొత్తం 40 మంది బస్సులో ఉన్నారు. ఇంజిన్‌ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌.. అప్రమత్తమై బస్సును నిలిపేశారు. వెంటనే ప్రయాణికులు, విద్యార్థులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. సాంకేతిక లోపంతోనే బస్సులో మంటలు చెలరేగి ఉంటాయంటున్నారు అధికారులు. బస్సుకు మంటలు వ్యాపించిన విషయాన్ని సిబ్బంది ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా మంటలు చెలరేగిన నేపథ్యంలో బయటకు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలేయడంతో అవన్నీ కాలి బూడిదయ్యాయి.

కాగా బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పలువురు ప్రయాణికులు వాపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనలో ఎవ్వరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఒకవేళ డ్రైవర్ గమనించకుండా అలాగే బస్సును ముందుకు పోనిచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us