Photo Goes Viral In Social: వయసు రీత్యా వచ్చే మార్పులను సామాన్యులే అంగీకరించక మేకప్ వేసుకుంటున్న రోజులివి.. ఇక సెలబ్రెటీలు, ప్రజాభిమానం సొంతం చేసుకున్న రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకునే రూపురేఖలతో కనిపించాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు.. అయితే నేను అందరికీ భిన్నం అంటున్నారు ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి.. కాలక్రమంలో వ్యవసాయదారుడిగా హలం పట్టిన ఓ రాజకీయ నేత.. అతని లేటెస్ట్ ఫోటోలు చూస్తే వెంటనే ఎవరు ఇతను అనుకునే విధంగా ఉన్నాయి. దీంతో సామాన్యుడిగా జీవిస్తున్న రాజకీయ నేత అంటూ ఆ ఫోటోని షేర్ చేస్తున్నారు అభిమానులు కార్యకర్తలు.. ఆ ఫొటోలో ఉన్న రాజకీయ నేత ఎవరో మీరు గుర్తుపట్టారా..
కొంచెం నిశితంగా గమనించండి.. అయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ మంత్రిగా ను సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అవును ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి నీలకంటపురం రఘువీరారెడ్డి మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
సాధారణ పౌరుడిలా జీవనం కొనసాగిస్తూ..వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు రఘువీరారెడ్డి వేషధారణ పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ నున్నటి సేవ్‌తో తెల్లటి ప్యాంట్, షర్ట్‌తో యువకుడిలా కనిపించే రఘువీరారెడ్డి.. ఇటీవల తెల్లటి గడ్డం, అడ్డపంచతో సామాన్యుడిలా దర్శనం ఇస్తున్నారు. ప్రస్తుతం రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురంలో తన పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన తన మనవరాలు సమీరా రెడ్డితో తీసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తన ముద్దుల మనవరాలికి గ్రామీణ వస్త్రధారణ చేయించి ప్రకృతివనంలో మురిసిపోతున్నాడు. సమీరా రెడ్డికి చిన్నతనం నుంచే వ్యవసాయం, గ్రామీణ నేపధ్యాన్ని పరిచయం చేస్తూ ఆమెకు ఆ వేషధారణ చేయించారు. రఘువీర ఆలోచనలకు కార్యకర్తలు, ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.
Also Read: సామాన్యుడు నుంచి మైక్రోసాప్ట్ చైర్మన్‌గా ఎదిగిన తెలుగు తేజం సత్య నాదెళ్ల పుట్టిన రోజునేడు