Tekkali: ఆలుమగలు మధ్య సీటు సిగపట్లు.. చివరకు భార్య మాటే నెగ్గి.. భర్త వెనక్కి తగ్గారా..?

|

May 26, 2023 | 6:05 PM

భార్యభర్తల మధ్య సీటు సిగపట్లకు దారితీసిందా..? చివరకు భార్య మాటే నెగ్గి.. భర్త వెనక్కి తగ్గారా..? టెక్కలి వైసీపీలో జరుగుతున్న తాజా చర్చ ఇదే..! ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రకటన తర్వాత చర్చ మరింత రసవత్తరంగా మారింది.

Tekkali: ఆలుమగలు మధ్య సీటు సిగపట్లు.. చివరకు భార్య మాటే నెగ్గి.. భర్త వెనక్కి తగ్గారా..?
Duvvada Srinivas - CM Jagan - Duvvada Vani
Follow us on

టెక్కలి వైసీపీలో ఏం జరుగుతోంది..? దువ్వాడ శ్రీనివాసే పోటీ చేస్తారని సాక్షాత్తూ సీఎం జగనే చెప్పిన తర్వాత ఎమ్మెల్సీ ఎందుకు వెనక్కి తగ్గారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డాయి టెక్కలి వైసీపీ శ్రేణులు. టెక్కలి టీడీపీ కంచుకోట కావడంతో ఇక్కడ పాగా వేయాలని అనేక ప్రయోగాలు చేస్తోంది అధికారపార్టీ. ఆ క్రమంలోనే వివిధ సామాజికవర్గాల నేతలకు పదవులు కట్టబెట్టింది. దువ్వాడను ఎమ్మెల్సీని చేసింది. అయితే దువ్వాడ ఇంట్లో పోరు మొత్తం సీన్‌ మార్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తన భర్తకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వొద్దని పార్టీ పెద్దలకు దువ్వాడ శ్రీనివాస్‌ భార్య వాణి చెప్పినట్టు సమాచారం. అంతేకాదు.. ఆ ఎమ్మెల్యే టికెట్‌ ఏదో తనకే ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.

ఈ ప్రచారాలు ఎలా ఉన్నా.. టెక్కలి వైసీపీలో మాత్రం ఎవరికి తోచిన విధంగా వాళ్లు విశ్లేషణలు చేసేస్తున్నారు. ఇలా వదిలేస్తే బాగోదని అనుకున్నారో ఏమో.. వచ్చే ఎన్నికల్లో వాణి పోటీ చేస్తారని స్వయంగా దువ్వాడే ప్రకటించారు. మొత్తానికి ఆలుమగల మధ్య లడాయిలో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ.. సడెన్‌గా అభ్యర్థి మారిపోవడం.. అదీ దువ్వాడే ప్రకటించి.. తన భార్యే బరిలో ఉంటారని చెప్పడం వైసీపీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

వాస్తవానికి టెక్కలి వైసీపీ సీటు ఆశిస్తున్న నాయకులకు కొదవ లేదు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే సీన్‌ మారిపోవడంతో.. ఈ రసవత్తర సన్నివేశం ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా మలుపులు ఉంటాయా అనేది కాలమే చెప్పాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..