Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్‌లో అసలు విషయం తేలింది

ఓ వ్యక్తి తన కాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. అంతా బాగానే ఉంది. అయితే కొద్ది రోజులకు అందులో అమర్చిన రాడ్ కి ఉన్న బోల్ట్ తీయాలని హాస్పిటల్ కి వచ్చాడు. అప్పుడూ ఆపరేషన్ జరిగింది. అయితే ఆ సమయంలో ఓ ఊహించని సీన్ ఎదురైంది.

Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్‌లో అసలు విషయం తేలింది
Viral

Updated on: Nov 30, 2025 | 12:41 PM

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం పంచాయితీ రామకృష్ణ నగరంకు చెందిన చిన్న(25) అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం కాలుకు గాయం తగలడంతో వైజాగ్‌లో గాయంకు ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పట్లో కాలికి బలంగా దెబ్బతగలడంతో లోపలి భాగంలో రాడ్ అమర్చి ఆపరేషన్ చేశారు. ఏడాదిన్నర గడిచిన తర్వాత వెలుపల ఉన్న ఒక బోల్ట్ తీస్తే త్వరగా సెట్ అవుతుందని చెప్పడంతో.. కాలులో రాడ్‌కు ఉన్న బోల్ట్ తీయించుకునేందుకు తుని గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లాడు. అక్కడ సిబ్బంది ఆపరేషన్ చేసి రాడ్ బోల్ట్ వెలపలకు తీశారు. కానీ కాలులో మాత్రం సిజెరియన్ బ్లేడు ఒక్కటి ఉంచి యధావిధిగా కుట్లు వేయడంతో.. ఆ విషయాన్ని స్కానింగ్‌లో గుర్తించాడు సదరు బాధితుడు.

హాస్పిటల్ సిబ్బంది ఎంతటి బాధ్యరాహిత్యంగా ఉంటున్నారో ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అర్ధం అవుతుందంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చేశారేంటని ఆస్పత్రి వైద్యులను ప్రశ్నిస్తే పేషెంట్ మీద తిరగబడ్డారు ఆ సిబ్బంది. చివరకు మళ్ళీ ఆపరేషన్ చేసి బ్లేడ్ తీసి హాస్పటల్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రభుత్వ హాస్పటల్‌లో పనితీరు అంటూ స్థానికులు
ప్రశ్నిస్తున్నారు.