Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో ఏపీ కొత్త మంత్రికి చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ భక్తుల నిరసన

Srikalahasti: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళ హస్తి దేవాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు (Minister Kottu Satyanarayana) చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి..

Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో ఏపీ కొత్త మంత్రికి చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ భక్తుల నిరసన
Minister Kottu Satyanarayan

Updated on: Apr 15, 2022 | 3:43 PM

Srikalahasti: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళ హస్తి దేవాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు (Minister Kottu Satyanarayana) చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి ( Srikalahasteeswara Temple) దర్శనానికి వెళ్తున్న సమయంలో ఆలయాల్లో భక్తుల నిరసన సెగ తగిలింది. క్యూ లైన్ లో నిలుచుకున్న భక్తులు మినిస్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. శ్రీకాళహస్తి దేవాలయంలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చేస్తున్న సమయంలో.. మంత్రి పర్యటన సందర్భంగా గంటల తరబడి స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో క్యూ లైన్ లో నిల్చున్న భక్తులు.. మంత్రి కొట్టు సత్యనారాయణకు వ్యతిరేకంగా గో బ్యాక్ మంత్రి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. భక్తుల ఆగ్రహాన్ని చవిచూసిన నూతన దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ…వివాదం పై జోక్యం చేసుకుని.. భక్తులకు సర్ది చెప్పారు. దీంతో వివాదం సర్దుమణిగింది.

 

Also Read: Rajasthan: రాజస్థాన్‌లో మిస్టరీ వ్యాధి.. ఏడుగురు చిన్నారులు మృతి.. నమూనాలు సేకరిస్తున్న వైద్య బృందాలు..

TSRTC: ప్రయాణికుల నెత్తిన మరో పిడుగు.. రిజర్వేషన్‌ ఛార్జీలను పెంచేసిన టీఎస్ఆర్టీసీ!

ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయితో పెళ్లి చేసుకుంటుండగా ఆందోళనకు దిగిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..