TTD: తిరుమల వెంకన్న దర్శనం కోసం అడ్డదారులు తొక్కిన వ్యక్తి.. ఏం చేశాడో తెలుసా!

|

Apr 12, 2024 | 6:53 AM

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఏడుకొండలవాడి దర్శనం కోసం ఎంత దూరం నుంచైనా వస్తుంటారు. అయితే స్వామివారి దర్శనం కోసం ఇక చాలామంది ప్రముఖుల నుంచి సిఫారసు లేఖలు కూడా తెచ్చుకుంటుంటారు. అయితే దర్శనం ముసుగులో కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఐఏఎస్ అధికారిగా నటిస్తూ పట్టుబడటం కలకలం రేపింది.

TTD: తిరుమల వెంకన్న దర్శనం కోసం అడ్డదారులు తొక్కిన వ్యక్తి.. ఏం చేశాడో తెలుసా!
Tirumala Tirupati
Follow us on

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఏడుకొండలవాడి దర్శనం కోసం భక్తులు ఎంత దూరం నుంచైనా వస్తుంటారు. అయితే స్వామివారి విఐపీ దర్శనం కోసం ఇక చాలామంది ప్రముఖుల నుంచి సిఫారసు లేఖలు కూడా తెచ్చుకుంటుంటారు. అయితే దర్శనం ముసుగులో కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఐఏఎస్ అధికారిగా నటిస్తూ పట్టుబడటం కలకలం రేపింది. ఐఏఎస్ అధికారిగా నటిస్తూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వీఐపీ బ్రేక్ దర్శనం కోరిన వ్యక్తిని తిరుమల పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న నరసింహారావు ఆలయంలోని వీఐపీ దర్శన సౌకర్యాల్లో నలుగురికి అనధికారికంగా ప్రవేశం కల్పించారు. అయితే నరసింహారావు వ్యవహరించిన తీరుపై తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. తనిఖీ చేయగా గుర్తింపు కార్డు నకిలీదని గుర్తించారు. ఫోర్జరీ, చీటింగ్ కింద రావుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనతో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు.

కాగా చెన్నైలోని టి నగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి జిఆర్ టి జ్యువెల్లర్స్ గ్రూప్ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. జీఆర్ టీ చైర్మన్ జీఆర్ రాజేంద్రన్ టీటీడీ తమిళనాడు, పుదుచ్చేరి స్థానిక సలహా కమిటీ అధ్యక్షుడు ఏజే శేఖర్ కు చెక్కు రూపంలో విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని టిటిడి టి నగర్ ఆలయంలో ప్రతిపాదిత విస్తరణ పనుల కోసం అదనపు స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగించనున్నట్లు ఎజె శేఖర్ తెలిపారు.