
విరుచుకుపడ్డ అర్నబ్ తుఫాను వెలిసింది… తీరాన్ని దాటి పారిపోయింది. దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా కోలుకోనేలేదు. కుంగదీసి వెళ్లిపోయిన తుఫాను జ్ఞాపకాల నుంచి ఇప్పట్లో తేరుకునే ఛాన్స్ కూడా లేదు. అల్లూరి ఏజెన్సీలో నిలువునా కోసుకుపోయి, పైనుంచి పడిన రాళ్లు, మట్టిపెళ్లలతో ధ్వంసమైన ఈ రోడ్లను చూడండి..? రెండు అడుగుల లోతులో చీలిపోయి, తారు మొత్తం కొట్టుకుపోయి కంకర తేలిన ఈ రోడ్లన్నీ ఎప్పటికి రిపేరయ్యేను? ఇక్కడి గిరిజనులకు ఎప్పటికి ఉపశమనం దొరికేను? ఏపీలో అర్నబ్ సృష్టించిన అరాచకానికి ఇటువంటి ఆనవాళ్లు ఒకటా రెండా… బోలెడన్ని. ఈదురుగాలులు, భారీవర్షంతో కోనసీమ జిల్లాలో ఉద్యానపంటకు ఊపిరే ఆగిపోయింది. ఎటుచూసినా అరటిచెట్లు, కొబ్బరి చెట్లు నేలకొరిగిన సీన్లే. జిల్లా మొత్తమ్మీద లక్షా 18వేల ఎకరాల్లో వరి పంట నాశనమైనట్టు లెక్క తేలింది. ఉప్పాడ సహా అన్ని తీర ప్రాంతాల్లో 450కి పైగా మత్స్యకార బోట్లు దెబ్బతిన్నాయి. ఇది ప్రాధమిక లెక్క మాత్రమే. వేల హెక్టార్ల అరటి తోటల్లో, పక్వానికి వచ్చిన గెలలున్న చెట్లు మధ్యకు విరిగి ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అదే దృశ్యం. ఒక ఊరికో, ఒక వీధికో, ఒక కాలనీకో ఒక చిన్న రోడ్డు వెయ్యాలంటే అలా అనుకోగానే ఇలా...