ఏపీపై తుపాన్ పంజా.. మొదలైన ముసురు.. పలు జిల్లాల్లో కుండపోతలు.. ఐఎండీ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్‌కు అర్నబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. తీర ప్రాంతాల్లో అప్పుడే ముసురు మొదలైంది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అతి తీవ్ర తుపాన్ గత ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, కాకినాడకు 180 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 270 కిలోమీటర్లు, బాపట్లకు 350 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.

ఏపీపై తుపాన్ పంజా.. మొదలైన ముసురు.. పలు జిల్లాల్లో కుండపోతలు.. ఐఎండీ వార్నింగ్!
Cyclone Arnab Alert Cm Chandrababu

Updated on: Oct 27, 2026 | 3:40 PM

ఆంధ్రప్రదేశ్‌కు అర్నబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. తీర ప్రాంతాల్లో అప్పుడే ముసురు మొదలైంది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అతి తీవ్ర తుపాన్ గత ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, కాకినాడకు 180 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 270 కిలోమీటర్లు, బాపట్లకు 350 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.

పలు జిల్లాల్లో వర్షాలు

తుపాన్ ప్రభావంతో ఇప్పటికే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

తీరం దాటే సమయంలో తీవ్ర ప్రభావం

తాజా అంచనాల ప్రకారం, తుపాన్ రేపు ఉదయానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ప్రజలకు అధికారుల హెచ్చరిక

తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటించాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సహాయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us