Cyber Crime: అంగన్ వాడీ టీచర్లకు సైబర్ నేరగాళ్ళ వల.. ఎంత పగడ్భందీగా వ్యవహారం చేశారంటే..

జనం అమాయకత్వమే వాళ్లకు పెట్టుబడి. జనం ఆశలు.. సైబర్ నేరగాళ్లకు వరాలుగా మారుతున్నాయి. రోజుకో.. కొత్త తరహా

Cyber Crime: అంగన్ వాడీ టీచర్లకు సైబర్ నేరగాళ్ళ వల.. ఎంత పగడ్భందీగా వ్యవహారం చేశారంటే..
Ciber Crime

Updated on: Sep 08, 2021 | 8:16 PM

Cyber Crime – Guntur Anganwadi teachers: జనం అమాయకత్వమే వాళ్లకు పెట్టుబడి. జనం ఆశలు.. సైబర్ నేరగాళ్లకు వరాలుగా మారుతున్నాయి. రోజుకో.. కొత్త తరహా చీటింగ్‌లకు పాల్పడుతున్నారు. అంగన్ వాడీ టీచర్లను టార్గెట్ చేశారు..లక్ష నొక్కేశారు. తాజాగా గుంటూరు జిల్లాలోని అంగన్ వాడీ టీచర్లకు వల వేశారు సైబర్ నేరగాళ్ళు. ప్రత్తిపాడు మండలంలోని ముగ్గురు అంగన్వాడీ కార్యకర్తలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. సీఎం కార్యాలయం నుంచి.. మాట్లాడుతున్నామంటూ ఫోన్లో చెప్పారు.

మీ గ్రామానికి డెవలప్ మెంట్ నిధులు ముంజూరు అయ్యాయన్నారు సైబర్ కేటుగాళ్లు. వెంటనే మీ ఫోన్ ఫే నెంబర్లు చెప్పాలంటూ.. ముగ్గురి నుండి ఫోన్ ఫే నెంబర్లు సేకరించారు. 50 వేలు మీ అకౌంట్స్ లో వేస్తామన్నారు. వచ్చిన ఓటీపీ నెంబర్లు చెప్పాలన్నారు. ఇదంతా నిజమేనని నమ్మన అంగన్వాడీ కార్యకర్తలు.. ఫోన్ నెంబర్లకు వచ్చిన ఓటీపీలు వెంట, వెంటనే చెప్పేశారు.

ఇంకేముంది.. అటు నుంచి మాట్లాడింది ది ఫ్రొఫెషనల్ సైబర్ థీవ్స్ అయే.. క్షణాల్లో ముగ్గురి ఖాతాలనుండి నగదు మాయమైంది. బొర్రావారిపాలెం అంగన్ వాడి టీచర్ ఖాతానుండి 49 వేలు, తిక్కిరెడ్డిపాలెం అంగన్ వాడీ టీచర్ ఖాతా నుండి 12 వేలు, పాతమళ్ళాయిపాలెం అంగన్ వాడీ టీచర్ ఖాతా నుండి 48వేలు మాయం చేశారు సైబర్ నేరగాళ్ళు. డబ్బులు కట్ అయినట్లుగా వెంట, వెంటనే అందరి ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో లబోదిబోమనడం అంగన్‌వాడీల వంతైంది.

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డబ్బులు ఇస్తామని వచ్చే మెసేజ్ ల పట్ల, పంపేవారి పట్ల, వ్యక్తిగత సమాచారం అడిగే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఆన్లైన్‌లో జరిగే మోసాలపై ప్రతి ఒక్కరు అవగాహనతో ఉండాలన్నారు.

Read also: Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్ధులకు పండుగంటే చాలు.. గుండెలదురుతున్నాయట.!