Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. చెప్పులను కొట్టేస్తూ అడ్డంగా బుక్కైన వ్యక్తి.. వీడియో చూస్తే షాకే..

Viral Video: కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా ఉంది దొంగల తీరు. ఇప్పుటి వరకు బైక్ దొంగలను చూశాం.. చైన్ స్నాచింగ్ దొంగలను చూశాం..

Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. చెప్పులను కొట్టేస్తూ అడ్డంగా బుక్కైన వ్యక్తి.. వీడియో చూస్తే షాకే..
Footware Robbery

Updated on: Aug 21, 2022 | 8:46 PM

Viral Video: కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా ఉంది దొంగల తీరు. ఇప్పుటి వరకు బైక్ దొంగలను చూశాం.. చైన్ స్నాచింగ్ దొంగలను చూశాం.. ఇళ్లలోకి దూరి దోచుకున్న దొంగలను చూశాం.. సెల్ ఫోన్ దొంగలను చూశాం.. కానీ, ఈ దొంగ చాలా వెరైటీ.. పెద్ద పెద్ద వస్తువులు వద్దనుకున్నాడో ఏమో గానీ, ఇళ్ల ముందు చెప్పులను దొంగిస్తున్నాడు. అవును ఇది నిజంగా నిజం. ఓ యువకుడు ఇంటి ముందు ఉన్న చెప్పులను కొట్టేస్తూ సీసీ కెమెరాకు చిక్కారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సామర్లకోటలో చెప్పుల దొంగ పడ్డాడు. ఇంటి ముందు విడిచిన చెప్పులను ఎత్తుకెళ్లాడు. అయితే, అవి అట్లాంటిట్లాంటి చెప్పులు కాదండోయ్.. ఏకంగా 7 వేల రూపాయల ఖరీదు చేసే చెప్పులు. అవునండీ బాబూ.. సామర్లకోట మటన్ సెంటర్‌లో ఎస్‌బిఐ ఏటీఎం పక్కన బట్టల షాపు ఉంది. ఆ ఓనర్‌ ఇంటి ముందు చెప్పుడు విడవగా.. వాటిని ఓ వ్యక్తి దొంగిలించాడు. అతను చెప్పులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగ ఎత్తుకెళ్లిన చెప్పుల విలువ రూ. 7 వేలు ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ చోరీకి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..