Corona Cases AP: ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

|

Feb 04, 2021 | 6:58 PM

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 28,254 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 79 పాజిటివ్...

Corona Cases AP: ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Coronavirus Cases In AP
Follow us on

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 28,254 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 79 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,88,178కి చేరింది. ఇందులో 1153 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,79,867 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

అటు నిన్న వైరస్ కారణంగా ఎలాంటి మరణం సంభవించలేదు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7157కు చేరుకుంది. ఇక నిన్న 87 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,32,42,802 సాంపిల్స్‌ను పరీక్షించారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 5, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, గుంటూరు 12, కడప 0, కృష్ణా 20, కర్నూలు 1, నెల్లూరు 3, ప్రకాశం 5, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 13, విజయనగరం 1, పశ్చిమ గోదావరి 6 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

మరిన్ని చదవండి:

మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్‌ ప్రకారమే..

టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!