జాతీయ రహదారి ఆనుకొని ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. వాటిని నివారించడానికి పిఠాపురం సర్కిల్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దానిలో భాగంగా నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించడమే కాకుండా, హెల్మెట్లు ధరించి నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు బహుమతులు అందజేస్తున్నారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు.. గొల్లప్రోలు జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దగ్గిర వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై రామకృష్ణ, పోలీస్ సిబ్బంది చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు జరిమానా విధించారు. హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతున్నవారికి ప్రోత్సాహకంగా బహుమతులు అందించారు. దీంతో పలువురు ద్విచక్ర వాహనదారులు పోలీసులను ప్రశంసించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలుపుతున్నారు.