Anakapalli District: చదువుకున్నోళ్ల మాదిరే ఉన్నారు.. ఇదేం పాడుబుద్ది.. అర్థరాత్రి సైలెంట్‌గా షాపు వద్దకు వచ్చి..

|

Oct 28, 2022 | 8:48 PM

పాడుబుద్ది ఉంటే నవ్వులపాలు కాక తప్పదు. అందుక ఈ యువకులే ఉదాహారణ. ఏం చేశారో మీరే చూడండి.

Anakapalli District: చదువుకున్నోళ్ల మాదిరే ఉన్నారు.. ఇదేం పాడుబుద్ది.. అర్థరాత్రి సైలెంట్‌గా షాపు వద్దకు వచ్చి..
Thieves
Follow us on

చూడ్డానికి విద్యావంతుల్లా ఉన్నారు.. కానీ వారిది వక్రబుద్ధి..! కేవలం కూల్ డ్రింక్స్ కోసం.. కక్కుర్తి పడ్డారు. ఓ షాపు ముందు ఉన్న ఫ్రిడ్జ్ లోంచి.. ఎవరికీ తెలియకుండా అనుకున్న పానీయాలు లాగేసారు. అది కూడా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో…! ఉదయం షాపు తెరిచే సమయానికి.. స్టాక్ తగ్గడంతో యజమానికి అనుమానం వచ్చింది.. సీసీ ఫుటేజ్ వెరిఫై చేసేసరికి.. ఆ యువకుల చేతివటం చూసి ఆశ్చర్యపోయాడు.

అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలోని పెదపల్లిలో వింతదొంగల హల్చల్ చేశారు. పెదపల్లిలోని ఓ కిరాణా షాపు ఫ్రిజ్ లోంచి కూల్ డ్రింకులూ, ఫ్రూటీలూ మూడో కంటికి తెలియకుండా అపహరించారు. షాపు బయట ఉన్న సీసీ టీవీ లో రికార్డైంది ఈ వింత దొంగల చేతివాటం. దొంగతనం చిన్నది అయినా.. వాళ్ల తిక్క కుదిర్చేందకు యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు షాపు యజమాని. ఇక.. ఈ చిల్లర దొంగల వ్యవహారం చూసి ఒకింత విస్తు పోయినా…సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దొంగల ఆచూకీకోసం ఆరాతీస్తున్నరు పోలీసులు.

చిన్న గుండు పిన్ను దొంగతనం చేసినా.. కోట్లు దోచేసినా దొంగోడనే అంటారు. ఎందుకంటే అక్కడ చూడాల్సింది దోచేసిన సొత్తు గురించి కాదు. బుద్ది గురించి. దురాసకు పోయి పరువు పోయి.. నలుగురులో తలదించుకోవాల్సి వస్తుంది. పనిలో పనిగా ఈ పోలీస్ కేసులు కూడా వెంటాడతాయి. అందుకే అంటారు దురాశ దు:ఖానికి చేటు అని.

 

మరిన్ని ఏపీ న్యూస్ కోసం