AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ బీర పాదుకు కాయలు ఎక్కువ కాయాలంటే ఇలా చేయండి..

టెర్రస్ గార్డెన్‌లో నిరంతరాయంగా బీరకాయల దిగుబడి సాధించడానికి, కొత్త విత్తనాలను వరుసగా నాటడం ముఖ్యం. పెరిగిన కాయలను ఎప్పటికప్పుడు కోయడం ద్వారా కొత్త పిందెలకు పోషకాలు అందుతాయి. వెడల్పు, లోతు ఎక్కువగా ఉండే కంటైనర్‌లను ఎంచుకొని, ప్రతి కంటైనర్‌లో మూడు నుండి నాలుగు పాదులను పెంచడం ద్వారా నిరంతర పంటను పొందవచ్చు.

మీ బీర పాదుకు కాయలు ఎక్కువ కాయాలంటే ఇలా చేయండి..
Growing Ridge Gourd
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2026 | 5:48 PM

Share

బీరకాయ మొక్కలు వేగంగా పెరిగి అధిక దిగుబడి ఇవ్వాలంటే సరైన మట్టి మిశ్రమం అవసరం. ఇందుకోసం ఎర్రమట్టి, వర్మీకంపోస్ట్ లేదా బాగా కుళ్లిన పశువుల ఎరువు, కోకోపీట్‌ను సమాన నిష్పత్తిలో కలిపి కంటైనర్‌లలో నింపాలి. ఈ మిశ్రమం వల్ల మొక్కలకు అవసరమైన పోషకాలు అందడంతో పాటు వేర్లు బలంగా అభివృద్ధి చెందుతాయి. బీరకాయ తీగలు వేగంగా విస్తరించే స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల మొక్కలు పెరగడం ప్రారంభమైన వెంటనే తాడు లేదా వైర్లతో పందిరి ఏర్పాటు చేయాలి. దీంతో తీగలు సులభంగా ఎగబాకి, పూత, కాయల సంఖ్య పెరుగుతుంది. అలాగే కాయలు నిటారుగా పెరిగి మంచి ఆకారాన్ని సంతరించుకుంటాయి.

ఎరువులు, నీటి నిర్వహణ

మొక్కలు పూత దశకు చేరుకున్న తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి వర్మీకంపోస్ట్, జీవామృతం లేదా ఇంట్లో తయారుచేసిన సేంద్రీయ ద్రవ ఎరువులను అందించాలి. వేసవిలో ప్రతిరోజూ, చల్లని కాలంలో అవసరాన్ని బట్టి నీరు పోయాలి. అయితే కుండీలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. అధిక తేమ వల్ల వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

సరైన కంటైనర్ ఎంపిక, నాణ్యమైన మట్టి మిశ్రమం, క్రమం తప్పకుండా ఎరువుల వినియోగం, పందిరి ఏర్పాటు, దశలవారీగా విత్తనాల నాటకం వంటి పద్ధతులను పాటిస్తే టెర్రస్ గార్డెన్‌లో బీరకాయల సాగు చాలా సులభంగా మారుతుంది. కొద్దిపాటి శ్రద్ధతో ఏడాది పొడవునా తాజా బీరకాయలను ఇంట్లోనే పండించుకుని ఆస్వాదించవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us