CM Jagan: కుప్పం సభలో సీఎం జగన్.. చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మఠం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 2022 సెప్టెంబర్ 23న జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన మాట నెలుబెట్టుకొని ఈరోజు కుప్పంకు నీరు అందించామన్నారు.

Follow us

|

Updated on: Feb 26, 2024 | 3:36 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మఠం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 2022 సెప్టెంబర్ 23న జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన మాట నెలుబెట్టుకొని ఈరోజు కుప్పంకు నీరు అందించామన్నారు. కుప్పంలో నీరు నిలుపుదల చేసేందుకు మరో రెండు రిజర్వాయిర్లు నిర్మిస్తాంమని హామీ ఇచ్చారు. గుడిపల్లి మండలం యామగానిపల్లి, శాంతిపురం మండలం మాధనపలి వద్ద మరో రిజర్వాయర్ చేపడుతున్నట్లు తెలిపారు. 530 కోట్లతో రిజర్వాయిర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కుప్పంకు చంద్రబాబు ప్రయోజనం లేదంటూ.. బ్రాంచ్ కెనాల్ పనులు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని వివరించారు. ప్రజా ధనాన్ని ఎలా దోచుకోవాలి, ఎలా ముడుపులు తీసుకోవాలనే విషయాల మీద మాత్రమే చంద్రబాబు రీసెర్చ్ చేశారన్నారు. చంద్రబాబుకు కావాల్సిన వాళ్లకు మాత్రమే కాంట్రాక్ట్‎లు ఇచ్చి డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు.కుప్పం నియోజకవర్గం ప్రజల దాహార్తిని కూడా చంద్రబాబు తీర్చలేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు వల్ల కుప్పం ప్రజలకు మేలు జరిగిందా అని ప్రశ్నించారు. అదే క్రమంలో వైసీపీ ప్రభుత్వం వల్ల కుప్పం ప్రజలకు మేలు జరిగిందా అని అడిగారు. కుప్పంకు కృష్ణ జలాలను తీసుకొచ్చింది మీ జగన్ అని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు మెడికల్ కాలేజీ రాకుండా చేసింది చంద్రబాబు అంటూ విమర్శించారు. కుప్పంను మునిసిపాలిటీ చేసింది మీ జగన్ అని తన పాలన గురించి వివరించారు. కుప్పం నియజకవర్గంలో 87,941 కుటుంబాలు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో 82,039 కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. కేవలం మహిళలకే 1400 కోట్లు అందించాం అని తెలిపారు. చంద్రబాబు హయాంలో కనీసం ఒక రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్‎లోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ 3 వేలు పెన్షన్ ఇవ్వడం లేదు.. కానీ కేవలం ఈ నియోజకవర్గంలోనే 43 వేల మందికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో సుమారు 15 వేల ఇళ్ల పట్టాలను ఇచ్చాం.. ఈ నెలలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. అలాగే 77 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‎లు నిర్మించి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. భరత్‎ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని సభ సాక్షిగా హామీ ఇచ్చారు. మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వస్తారు.. ఆయన మాటలను ఎవరైనా నమ్మగలమా అని వేదిక ముందున్న ప్రజలను అడిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్