CM Jagan: ‘మా కన్నీళ్లను మీ చిరునవ్వుతో తుడిచేశారు’.. విద్యార్థిని స్పీచ్‌కు సీఎం జగన్ ఫిదా

|

May 24, 2023 | 5:10 PM

కొవ్వూరు సభలో విద్యా దీవెన అందుకుంటున్న తాళ్లపూడి మండలకు చెందిన దివ్య అనే డిగ్రీ విద్యార్థిణి తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది. ఆమె స్పీచ్‌కు సీఎం ఫిదా అయ్యారు. ప్రసంగం తర్వాత ఆ విద్యార్థిని వేదికపై ఉన్న సీఎం జగన్‌ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంది.

CM Jagan: మా కన్నీళ్లను మీ చిరునవ్వుతో తుడిచేశారు.. విద్యార్థిని స్పీచ్‌కు సీఎం జగన్ ఫిదా
Cm Jagan
Follow us on

జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికా­నికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం జగన్ విడుదల చేశారు. 9.95 లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బటన్‌ నొక్కి నేరుగా జమచేశారు సీఎం. ఈ సందర్భంగా స్టేజీపై ముఖ్యమంత్రిపై ప్రశంసలు గుప్పించింది  తాళ్లపూడి మండలానికి చెందిన దివ్య అనే డిగ్రీ విద్యార్థిని.

‘నేను ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం సీఎం జగన్. మా నాన్నకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నారు. అమ్మ చెవిటి-మూగ. అయినప్పటికీ నాకు అన్నగా అండగా నిలబడ్డారు జగన్ అన్న. నాకు విద్యా దీవెనతో పాటు, వసతి దీవెన కూడా అందించారు. మా కుటుంబానికి అండగా నిలబడిన జగనన్నకు థ్యాంక్స్. ఆర్థిక పరిస్థితి కారణంగా చిన్నప్పటి నుంచి ఇంటర్‌ వరకూ తెలుగు మీడియంలోనే చదువుకున్నా.. ఇప్పుడు కార్పోరేట్‌ కళాశాలలో బీకామ్‌ కంప్యూటర్స్‌ చదువుతున్నానంటే కారణం జగనన్నే. ముఖ్యమంత్రి అయ్యాక సీఎం జగన్ గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు కూడా మార్చేశారు. ఆ స్కూళ్లను ఇప్పుడు చూస్తుంటే మళ్లీ స్కూలుకి వెళ్లి చదువుకోవాలనిపిస్తుంది. ఎంత ఏడ్చినా మా కన్నీళ్లు ఆరవు అనుకున్నాం. మా చదువుల సమస్యలు కూడా తీరవు అనుకున్నాం.. కానీ మా కన్నీళ్లకు మీ చిరునవ్వుతో సమాధానం చెప్పారు. మా లాంటి పేద విద్యార్థుల కోసమే పుట్టిన భరోసా జగనన్న” అంటూ సీఎం జగన్‌‌ను ప్రశంసలతో ముంచెత్తింది విద్యార్థిని దివ్య. ఆమె స్పీచ్‌ను సీఎం ఫిదా అయ్యారు. దివ్యను దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు.