CM Jagan: అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ వ్యవసాయ శాఖ.. అధికారులను అభినందించిన సీఎం జగన్..

|

Dec 15, 2022 | 3:42 PM

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖను పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో అవార్డు వరించింది. ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్ అభినందించారు.

CM Jagan: అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ వ్యవసాయ శాఖ.. అధికారులను అభినందించిన సీఎం జగన్..
CM Jagan Congratulates Agriculture Officials
Follow us on

వ్యవసాయ శాఖ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను అభినందించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయ రంగంలో విశేషంగా కృషి చేస్తున్న ఏపీ వ్యవసాయ శాఖను అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ప్రత్యేకంగా సత్కరించింది. ఢిల్లీలో జరిగిన 13 వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ 2022లో ఈ అవార్డును ప్రధానం చేశారు నిర్వాహకులు. పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో అవార్డు కైవసం చేసుకుంది ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ. అవార్డు స్వీకరించిన ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు సీఎం జగన్‌ను కలిశారు. రాష్ట్రానికి వచ్చిన అవార్డును సీఎం జగన్‌కు అందించారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌. శేఖర్‌ బాబు గెడ్డం.

ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్ అభినందించారు. వారి పనితీరును ప్రశంసించారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలను అందించాలని ప్రోత్సహించారు. సీఎం జగన్‌ నేతృత్వంలో గడిచిన మూడున్నరేళ్ళుగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో అత్యుత్తమ పాలసీ విధానాలకు గుర్తింపుగా ఈ అవార్డును కైవసం చేసుకుంది ఏపీ ప్రభుత్వం.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం