
తనను పట్టించుకోవట్లేదనే కోపంతో ఓ యువకుడు.. ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేటకు చెందిన హసీనా గుంటూరు జిల్లాలోని మిట్లపల్లి కాలేజ్ లో బిటెక్ చదివింది. ఆ సమయంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన బాల సైదులుతో ఆమె ఇన్ స్టాగ్రాంలో పరిచయడం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. బీటెక్ పూర్తి కావడంతో హసీనా సూళ్లూరుపేటలోని ఒక ప్రవేటు కంపెనీలో ఉద్యోగిగా జాయిన్ అయింది. చిలకలూరిపేటలో చదువు పూర్తి కావడంతో స్వంత గ్రామానికి చేరిన బాల సైదులు పొలం పనులు చేస్తున్నాడు.
అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత హసీనా బాల సైదులతో మాట్లాడటం తగ్గించింది. దీంతో బాల సైదులు ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు నిర్ధారణకు వచ్చాడు. దీంతో ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే హసీనాతో మాట్లాడని.. ఆమెను సూళ్లూరు పేట నుండి చిలకలూరిపేట వచ్చేలా చేశాడు. పేట చేరుకున్న హాసీనాను కారంపూడి రావాలని వేడుకున్నాడు. అక్కడి వచ్చిన ఆమెను కాలువ కట్టపై నిర్మానుషంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి వెంట తెచ్చిన కత్తితో పొడిచి చంపేశాడు.ఆ తర్వాత ఆనవాళ్లు దొరకకూడదని భావించి.. పెట్రోల్ పోసి తగులబెట్టి అక్కడ నుండి వెళ్లిపోయాడు.
ఇక ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన హాసినా తిరిగిరాకపోవడంతో కంగారు పడిన ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పీఎస్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. హసీనా కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే కారంపూడి మండలంలోని నాగార్జున సాగర్ కాలువ కట్టపై ఓ గుర్తు తెలియని మ్రుతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మ్రుతదేహం కొంతమేర కాలిపోయి మిగిలిన భాగం కుళ్లిపోయి ఉన్నట్టు గుర్తించారు.
దీంతో మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు అక్కడికక్కడే పోస్టు మార్టమ్ నిర్వహించి.. ఆ బాడీ హసీనాదిగా తేల్చారు. అనంతరంపై కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. నిందితుడిగా అనుమానించిన బాల సైదులను అదుపులోకి తీసుకొని విచారించగా తనే చింపేసినట్లు ఒప్పుకున్నాడు.దీంతో బాల సైదులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.