Election Commission: పెద్ద ఎత్తున ఓట్లు తీసేసారని వస్తున్నది తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల ప్రధానాధికారి

Mukesh Kumar Meena: గతంలో ఓటులేని వారు, కొత్తగా 18 సంవత్సరాలు దాడినవారు ఇప్పుడు తాజా ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఓటర్ల జాబితా ప్రక్రియను ట్రాన్సిపిరేన్స్‌గా రూపొందిస్తామన్నారు. ఏపీలో యువ ఓటర్లు చాలా తక్కువ ఉన్నారని వెల్లడించారు.

Election Commission: పెద్ద ఎత్తున ఓట్లు తీసేసారని వస్తున్నది తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల ప్రధానాధికారి
Mukesh Kumar Meena

Updated on: Jun 19, 2023 | 6:52 PM

వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా రెడీ చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ల జాబితాలను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి తనిఖీ చేస్తామన్నారు. అక్టోబర్ 17 న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తామన్నారు. తర్వాత వాటిపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు స్వీకరిస్తామని క్లారిటీ ఇచ్చారు. 2024 ఫిబ్రవరి 5 న తుది ఓటర్ల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే ఇంటింటి తనిఖీలలో సరి చేస్తామని ముఖేష్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీలు BLAలను నియమించుకోవచ్చన్నారు. వాళ్ళు కూడా ఇంటింటి తనిఖీలుకి వెళ్లొచ్చన్నార. పెద్ద ఎత్తున ఓట్లు తీసేసారని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అదంతా తప్పుడు ప్రచారం అని వివరణ ఇచ్చారు.

రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకోవచ్చని చెప్పారు. ప్రతి వెయ్యి మందిలో 714 మంది ఓటర్లు ఉండాలన్నారు. ఏపీలో కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ ఉందని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఓటులేని వారు, కొత్తగా 18 సంవత్సరాలు దాడినవారు ఇప్పుడు తాజా ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఓటర్ల జాబితా ప్రక్రియను ట్రాన్సిపిరేన్స్‌గా రూపొందిస్తామన్నారు. ఏపీలో యువ ఓటర్లు చాలా తక్కువ ఉన్నారని వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం