Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఒక్కసారిగా తగ్గిన ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. నాన్ వెజ్ ప్రియులకు ఇది సూపర్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో చికెన్ షాపుల వద్ద రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ధరల గురించి తెలుసుకుందాం.

Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఒక్కసారిగా తగ్గిన ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
Chicken Prices

Updated on: May 03, 2026 | 6:36 AM

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో రూ.300 వరకు చేరుకోగా.. ఈ నెలలో తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా చికెన్ ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు ఊరట చెందుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ షాపుల ముందు మంసం ప్రియులు క్యూ కడుతున్నారు. దీంతో షాపులన్నీ రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సెలవు రోజు కావడంతో చికెన్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

చికెన్ ధరలు ఇలా..

హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.259 వద్ద కొనసాగుతోంది. గతంలో రూ.300 వరకు చేరుకోగా.. ఇప్పుడు రూ.40 మేర తగ్గి ఊరటనిచ్చింది.

ఇక హైదరాబాద్‌లో కిలో డ్రస్‌డ్ చికెన్ రూ.228గా ఉండగా.. ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.130, రిటైల్ లైవ్ బర్డ్ రూ.157 వద్ద కొనసాగుతోంది.

-ఇక కరీంనగర్ జోన్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.259గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.228, రిటైల్ లైవ్ బర్డ్ రూ.157, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.130 వద్ద కొనసాగుతోంది.

-ఇక విజయవాడ జోన్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.248గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.218, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.123, రిటైల్ లైవ్ బర్డ్ రూ.150 వద్ద కొననసాగుతోంది.

-చికెన్ ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. రవాణా ఖర్చులు, ఫారంల నిర్వహణ బట్టి ధరల్లో మార్పలు ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో ఒకేలా ధరలు ఉండవు. దీనిని వినియోగదారులు గమనించాలి

గ్రుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే..?

విజయవాడ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.75గా ఉండగా.. హైదరాబాద్ జోన్‌లో రూ.72 వద్ద కొనసాగుతున్నాయి. ఇక కరీంనగర్ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధరలు రూ.74గా ఉన్నాయి. గ్రుడ్ల ధరలు కూడా ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. గతంలో గుడ్ల ధరలు ఒక్కో గుడ్డు రూ.10 వరకు చేరుకుంది. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల సరుకు రవాణాకు అంతరాయం కలగడంతో దేశం నుంచి గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీని వల్ల దేశంలో గుడ్లు ఎక్కువగా అందుబాటులో ఉండటంతో వీటి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు రూ.5కే లభిస్తోంది. సామాన్యులకుు అందుబాటులో ఉండే గుడ్ల ధరలు తగ్గడంతో ఊరట చెందుతున్నారు. అయితే మరికొన్ని రోజుల పాటు చికెన్, గుడ్ల ధరలు ఇలాగే కొనసాగే పరిస్థితి ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

 

Follow Us