విలువలు, విశ్వనీయతకు జగన్ నిదర్శనం

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ పరాభవం అనంతరం ఆ పార్టీ నేతలు కూడా డిఫెన్స్‌లో పడ్డారు. తాజగా వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు చంద్రబాబుపై నిప్పులు కురిపించారు.  టీడీపీ ఆఫీసులో జగన్ ఫోటో పెట్టుకొని పార్టీని నడపాలని ఆయన చంద్రబాబుకు సూచించారు . విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ బ్రతికుండటానికి కారణం సీఎం జగనే అని ఆయన అన్నారు. […]

విలువలు, విశ్వనీయతకు జగన్ నిదర్శనం

Updated on: Jun 15, 2019 | 3:21 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ పరాభవం అనంతరం ఆ పార్టీ నేతలు కూడా డిఫెన్స్‌లో పడ్డారు. తాజగా వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు చంద్రబాబుపై నిప్పులు కురిపించారు.  టీడీపీ ఆఫీసులో జగన్ ఫోటో పెట్టుకొని పార్టీని నడపాలని ఆయన చంద్రబాబుకు సూచించారు . విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ బ్రతికుండటానికి కారణం సీఎం జగనే అని ఆయన అన్నారు. చంద్రబాబు లాగానే  జగన్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలుతారా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీలోకి వచ్చే ఇతర నేతలను రాజీనామాలు చేసిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటామని జగన్ చెప్పడం విలువలు, విశ్వయనీయత ఏపీ సీఎం జగన్‌లో ఏ మేరకు ఉన్నాయో చెప్పడానికి నిదర్శనమన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us