Pawan Kalyan – Chandrababu: తొలిసారి పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు.. కీలక ప్రకటన చేసే ఛాన్స్..

|

Dec 17, 2023 | 9:59 PM

Pawan Kalyan - Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ.. ప్రతిపక్ష టీడీపీ, జనసేన దూకుడు పెంచాయి. ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.

Pawan Kalyan – Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ.. ప్రతిపక్ష టీడీపీ, జనసేన దూకుడు పెంచాయి. ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి ఆదివారం రాత్రి చంద్రబాబు చేరుకుని.. ఆయనతో సమావేశమయ్యారు. చంద్రబాబు అరెస్టు అనంతరం.. ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీచేస్తుందని.. ఆ దిశగా ఇరు పార్టీలు ముందుకు వెళ్తాయని ప్రకటించారు. ఈ మేరకు పలుమార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించాయి. అంతేకాకుండా.. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది. కానీ.. వీటి గురించి ఇరు పార్టీలు అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు.. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు తొలిసారి.. పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై చర్చతోపాటు.. ఎపీ ఎన్నికలు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ కీలక భేటీ అనంతరం పవన్, చంద్రబాబు ఉమ్మడిగా కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంటుందని.. రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఏపీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఇద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.. భేటీ అనంతరం జనసేన కీలక ట్వీట్ చేసింది.. ఇరుపార్టీల పొత్తుపై చర్చలు. ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టత గురించి సమాలోచనలు..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ దిశగా చర్చలు.. జరిగినట్లు వెల్లడించింది.

జనసేన ట్వీట్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..