Chain Snatching Attempt in Alipiri: తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారు జాము సమయంలో తిరమల అలిపిరి నడక మార్గంలో దొంగల్ హల్‌చల్ చేశారు. అలిపిరి నడక మార్గంలో ఏడోమైలు రాయి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు భక్తులను ఫ్లాష్ లైట్‌తో వెంబడించి చైన్ స్నాచింగ్‌కు ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన భక్తులు 100 నెంబర్‌కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.
భక్తులను దగ్గరుండి మరీ సురక్షితంగా తిరుమలకు తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన భక్తులు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. ఇదిలాఉంటే.. నడకదారిలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also read:
India Vs Australia 2020: స్టీవ్ స్మిత్ ఔట్.. ఆసీస్ ఆధిక్యం 235.. పట్టు బిగించిన టీమిండియా..