Viveka Murder case: వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు.. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌తో కలిపి..

|

Apr 19, 2023 | 10:02 PM

మాజీ మంత్రి YS వివేకానందారెడ్డి హత్యకేసులో వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి సీబీఐ విచారణ తొలిరోజు ముగిసింది. ఇద్దర్నీ ఐదున్నర గంటలపాటు విచారించగా, అటు ఎంపీ అవినాష్‌రెడ్డిని 8 గంటలకు పైగా సుధీర్ఘంగా విచారించారు సీబీఐ అధికారులు.

Viveka Murder case: వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు.. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌తో కలిపి..
Ys Viveka Murder Case
Follow us on

భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌లను ఐదున్నర గంటలపాటు సీబీఐ విచారణ ఇద్దరినీ వేర్వేరుగా విచారించిన సీబీఐ అధికారులు. వైఎస్ వివేకానందారెడ్డి మర్డర్‌ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. YS భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌లని తొలిరోజు సీబీఐ అధికారులు దాదాపు ఐదున్నర గంటల పాటు విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌లను CBI కార్యాలయానికి తరలించారు. ఇద్దరినీ వేర్వేరుగా విచారించినట్లు సమాచారం.
ప్రధానంగా వివేకా హత్యకు దారితీసిన కారణాలు, హత్యకు గురైతే గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే దానిపై ప్రధానంగా సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి చెప్పిన సమాచారం ఆధారంగానే ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించినట్లు సమాచారం. ముగ్గురిని కలిపి గంటన్నరపాటు విచారించినట్లు సమాచారం. ఆ తర్వాత వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇక ఎంపీ అవినాష్‌రెడ్డిని దాదాపు 8 గంటలకుపైగా విచారించారు సీబీఐ అధికారులు. అవినాష్‌రెడ్డి విచారణను సీబీఐ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేశారు. వివేకానందారెడ్డి హత్య జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది..? అక్కడికి ఏ సమయానికి వెళ్లారు..? నిందితులు భాస్కర్‌రెడ్డి ఇంటికి రావడానికి కారణాలేంటి..? హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరిపివేయడంపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

సీబీఐ రిపోర్ట్ ఆధారంగానే అవినాష్‌రెడ్డి ముందుస్తు బెయిల్‌పై తీర్పు

ఎంపీ అవినాష్‌రెడ్డి ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకూ విచారణను ఎదుర్కోవాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ రిపోర్ట్ ఆధారంగా అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. నోటిమాటతో నిందితుడిగా చేర్చడం చట్ట విరుద్ధమని..సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను లేవనెత్తారు అవినాష్‌ న్యాయవాది. అయితే అవినాష్‌రెడ్డి న్యాయవాది లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంది హైకోర్టు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం