YS Viveka Case: వైయస్ వివేకా మర్డర్‌ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఎవిడెన్స్ ట్యాంపర్ చేసింది ఎవరో చెప్పిన సీబీఐ

|

Apr 15, 2023 | 2:01 PM

వివేకా హత్య కేసు దర్యాప్తు మరింత స్పీడందుకుంది. తాజాగా ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంది దర్యాప్తు సంస్థ. అతడి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పొందుపరిచింది. ఆ వివరాలు తెలసుకుందాం.

YS Viveka Case: వైయస్ వివేకా మర్డర్‌ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఎవిడెన్స్ ట్యాంపర్ చేసింది ఎవరో చెప్పిన సీబీఐ
Ys Viveka Murder Case
Follow us on

YS.వివేకానందారెడ్డి మర్డర్‌కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఈనెల 26 వరకూ రిమాండ్‌ విధించారు.

ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు ప్రస్తావించింది సిబిఐ. మరోసారి ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్ర గురించి పేర్కొంది.  ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి కలిసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారని సిబిఐ ఆరోపించింది.  పైగా వివేక హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసన్నది రిమాండ్‌ రిపోర్ట్‌లో సీబీఐ చెప్పిన మాట. వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్లారని పేర్కొంది.  గూగుల్ టేక్ అవుట్ లోకేషన్ లోనూ అవినాష్ ఇంట్లోనే ఉదయ్‌ని చూపించిందంని సీబీఐ వివరించింది.  వివేకా చనిపోయారని సమాచారం వచ్చేవరకూ ఆయన అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు చెబుతోంది సీబీఐ. వివేకా చనిపోయిన విషయం బయటికి రాగానే 2 నిమిషాల్లో అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలు వివేక ఇంటికి చేరుకున్నారంటోది సీబీఐ.  ఈ మొత్తం వ్యవహారంపై ఉదయ్ కుమార్ రెడ్డిని పలుమార్లు విచారించినా సహకరించలేదని చెబుతోంది దర్యాప్తు సంస్థ. ఉదయ్ కుమార్ రెడ్డి పారిపోతాడనే డౌట్‌ కూడా సీబీఐలో ఉంది. అందుకే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు రిపోర్ట్‌లో చెప్పింది.

వైఎస్‌. వివేకానందారెడ్డి హత్యకేసులో ఉదయ్‌కుమార్‌ను విచారణ కోసం సీబీఐ కస్టడీ పిటిషన్‌ వేసింది. మరోవైపు ఉదయ్‌కుమార్‌ తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్‌ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.

YS వివేకా హత్య జరగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సీబీఐ సేకరించిన గూగుల్ టేక్ ఔట్ లో ఉదయ్ కుమార్‌కి సంబంధించిన వివరాలు ఉండడంతో సీబీఐ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. గత మూడు రోజులుగా సీబీఐకి చెందిన 15 మంది సభ్యుల బృందం కడపలో మకాం వేసి ఉయద్‌కుమార్‌ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే జయప్రకాష్ రెడ్డి, కుమారుడు యూసిఎల్ ఉద్యోగి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీబీఐ వారి స్టేట్ మెంట్ రికార్డు చేసింది. గతంలో విచారణ పేరుతో సీబీఐ తనని వేధిస్తోందని ఉదయ్‌కుమార్‌ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీరామ్‌సింగ్‌పై కడప కోర్టులో ప్రైవేట్‌ కేసు సైతం దాఖలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..