Twin Claves: కర్నూలులో వింత ఘటన.. బ్రహ్మంగారి కాలజ్ఞానం.. నిజమవుతుందంటున్న జనం

| Edited By: Anil kumar poka

Nov 22, 2021 | 12:21 PM

Twin Claves: కర్నూలు జిల్లాలో వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటన చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు చట్టుపక్కల గ్రామాల ప్రజలు..

Twin Claves: కర్నూలులో వింత ఘటన.. బ్రహ్మంగారి కాలజ్ఞానం.. నిజమవుతుందంటున్న జనం
Twin Claves
Follow us on

Twin Claves: కర్నూలు జిల్లాలో వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటన చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు చట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వింతను చూడడానికి భారీగా తరలివస్తున్నారు. ఇది కలికాలం ఇలాంటి వింతలే జరుగుతాయి. అయినా ఇదంతా ఎప్పుడో బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అవి ఇప్పుడు నిజమవుతున్నాయి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కారు గ్రామంలో ని ఓ రైతుకు చెందిన గేదె ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఆవులు, గేదెలు ఒక ఈతలో కేవలం ఒక దూడకే జన్మనిస్తాయి. గతంలో శ్రీకాకుళంలో ఒక రైతు ఇంట గోమాత మూడు దూడలకు జన్మనిచ్చింది. కాగా తాజాగా కర్నూలు జిల్లాలో గేదె రెండు దూడలకు జన్మనివ్వడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి తరలివచ్చి ఈ గేదె దూడలను చూసి మురిసి పోతున్నారు.

Also Read:

కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులకు నందమూరి రామకృష్ణ స్ట్రయిట్ వార్నింగ్..

సల్మాన్ ని కలిసిన రాజమౌళి.. అసలు మ్యాటరేంటంటే..

కోలకళ్లతో .. చిరుమందహాసంతో.. కట్టిపడేస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు హాట్ యాంకర్.. గుర్తుపట్టారా..?