Andhra Pradesh: అక్రమ సంబంధాలు.. వివాహేతర సంబంధాలు ఉచ్చులో పడి.. పచ్చని కాపురాలు అతలాకుతలం అవుతున్నాయి. కొంతమంది వావివరసలు మరిచి.. తప్పుడు మార్గాల్లో నడిచి.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. తాజాగా తిరుపలి జిల్లాలో దారుణం జరిగింది. చిల్లకూరు మండలం(Chillakur mandal) కాకువారిపాలెంలో తోడబుట్టిన సోదరుడ్ని అన్న హతమర్చాడు. అందుకు కారణం అక్రమ సంబంధం. వివరాల్లోకి వెళ్తే.. బాలాజీ, ప్రతాప్ ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన సోదరులు. కాగా కొంతకాలం క్రితం ప్రతాప్ భార్య మరణించడంతో.. అన్న బాలాజీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కనీస ఇంగితం లేకుండా అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ప్రతాప్. రోజులానే పొలానికి వెళ్లి.. ఇంటికి వచ్చిన బాలాజీకి వీరి బాగోతం కంటపడింది. వారిద్దర్నీ అలా చూసి అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. ఆవేశంతో పక్కన ఉన్న కర్రతో తమ్ముడి తలపై బలంగా కొట్టడంతో.. అతడు స్పాట్‌లోనే మృతిచెందాడు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరించి.. కేసు ఫైల్ చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..