Blood Shortage: ఏపీలో రక్తం నిల్వలపై సమ్మర్ ఎఫెక్ట్.. అలాంటి పరిస్ధితులు మళ్లీ రావచ్చనే సంకేతాలు..!

వేసవికాలంలో నీటి కుంటలు, చెరువులు, కాలువలు,నదులు లాంటివి అడుగంటడం చూస్తుంటాం.. కానీ ఈ సమ్మర్ లో మాత్రం బ్లడ్ బ్యాంకులు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవును మీరు విన్నది నిజమే రాష్ట్రం లో వచ్చే రోజుల్లో తీవ్రమైన రక్తం కొరత వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న..

Blood Shortage: ఏపీలో రక్తం నిల్వలపై సమ్మర్ ఎఫెక్ట్.. అలాంటి పరిస్ధితులు మళ్లీ రావచ్చనే సంకేతాలు..!
Blood Shortage

Updated on: Apr 05, 2023 | 7:00 AM

వేసవికాలంలో నీటి కుంటలు, చెరువులు, కాలువలు,నదులు లాంటివి అడుగంటడం చూస్తుంటాం.. కానీ ఈ సమ్మర్ లో మాత్రం బ్లడ్ బ్యాంకులు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవును మీరు విన్నది నిజమే రాష్ట్రం లో వచ్చే రోజుల్లో తీవ్రమైన రక్తం కొరత వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 189 బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు పడిపోవడానికి కారణాలు ఏంటి? ఈ పరిస్థితి నుండి గట్టెక్కెందుకు ఏపి సాక్స్ ఏలాంటి చర్యలు చేపట్టింది?

భయంకరమైన కోవిడ్ రోజుల్లో బ్లడ్ దొరక్క ఇబ్బంది పడ్డ పరిస్థితులు మళ్ళీ రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2 వరకు ఉన్న రక్తం నిల్వలు 3307 యూనిట్లు..రోజుకు మనకి కావాల్సిన రక్తం యావరేజ్ గా 1600 యూనిట్లు.. అంటే మనకి కేవలం రెండు రోజులకు సరిపడా రక్తం మాత్రమే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంకులు 189. అందులో గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులో 43, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు 128 మరో 18 రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా సరిపడా రక్తం నిల్వలు లేని పరిస్థితి.. దానికి కారణం స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చే వారికి సంఖ్య లేకపోవడం అని తెలుస్తుంది.

ఈ కొరత ప్రభావం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిపై తీవ్రంగా చూపుతోంది. ఒక్కో సమయంలో విలువైన ప్రాణాలు కూడా పోతున్నాయి. తలసేమియా రోగులు అయితే.. రక్తదానం చేసే దాతలపైనే ఆధారపడి బతుకుతారు. అలాంటిది.. ఇప్పుడు దాతలు లేక పోవడంతో వారి జీవితాలు గాల్లో దీపంలా మారిపోయాయి. రాష్ట్రం లో తలసేమియాతో బాధపడుతున్న వారు మొత్తం 2129 మంది ఉన్నారు. విరు ప్రతి 15 నుంచి 30 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాలి.. వారి బంధువులు రక్తం కోసం ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. తలసేమియా రోగులు, గర్బిణీలు, ఆక్సిడెంట్స్‌లో గాయాల పాలైన వారు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరికి ఇప్పటికైతే అతికష్టం మీద బ్లడ్ దొరుకుతుంది.. ఇంకా ఎండలు పెరిగితే మాత్రం వీరికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కొవిడ్ కాలం లో ఆ తరువాత వ్యాక్సినేషన్ జరిగిన కాలంలో రక్తం నిల్వలు అడుగంటిన పరిస్థితి చూసాం…ఇప్పుడు వేసవికాలంలో డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్ కి పరీక్షలు ఉండడం..తరువాత వరుస సెలవులు వంటి వాటితో బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు క్యాంపులు పెడితే బ్లడ్ డొనేట్ చేయడానికి ఎవ్వరూ లేకపోవడం ఒక సమస్య. ఇది ఒక ఎత్తైతే..వేడి గాల్పులతో రోడ్లపైకి పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉండదని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు అంటున్నారు.

మీరిచ్చే యూనిట్ రక్తం మూడు బాగాలుగా ఉపయోగించి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. ఉదాహరణకు మీ రక్తంలోని ఎర్రరక్తకణాలను ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి,హీమోఫిలియా అనే బ్లీడింగ్ డిజార్డర్ వ్యాధితోనున్న వ్యక్తికి ప్లాస్మా ద్వారా..డెంగ్యు వంటి ప్రాణాంతక జ్వరంతోనున్న వ్యక్తికి లేదా థ్రోంబోసైటీమియా వంటి వ్యాధితో నున్న వ్యక్తికి ప్లేటిలెడ్స్ ఇవ్వడం ద్వారా మీరు కాపాడొచ్చు. కానీ ఈ రోజుల్లో రక్తదానం చేస్తామని ముందుకొచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. జనాభాలో నూరింట అయిదుగురు మాత్రమే రక్తదానం చేస్తామని ముందుకి వస్తున్నారు అంటే పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సైజన్లో రక్తం కొరత ఏర్పడకుండా గతంలో బ్లడ్ చేసిన డోనర్స్ కి ఫోన్ చేసి వారిని మళ్ళీ బ్లడ్ డొనేట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఏపీ సాక్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు డైరెక్షన్ ఇస్తున్నారు

రక్త దానం చేస్తే.. ప్రాణ దానం చేసినట్టే.. రక్త దాతలు దైవ సమానులుగా తులతూగు తారని, అందుకే ఆరోగ్య వంతులు ఏటా 3 పర్యాయాలు రక్తదానం చేయవచ్చు.ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు రక్తదానం చేయ్యొచ్చు.. సగటు 45 కేజీల బరువున్న వారు . 12.5 గ్రాముల హీమోగ్లోబిన్ ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. జీవితకాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తదానం చెయ్యొచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us