Bhuma Akhila Priya Arrest:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలోని లోధా బెలీజా నుంచి అఖిల ప్రియను ఆమె సొంత కారులోనే బోయిన్‌పల్లి పీస్‌కు తరలిస్తున్నారు. కాగా, అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
హఫీజ్‌పేటలోని రూ.100 కోట్ల విలువైన భూమి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువు, జాతీయ హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతని ఇద్దరి సోదరులను దుండగులు కిడ్నాప్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న ప్రవీణ్ రావు, ఆయన సోదరులు సునీల్ రావు, నవీన్ రావులను మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో అపహరించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల వాహనాలను వెంబడించారు.
చివరికి దుండగులను పట్టుకున్నారు. నిందితుల చెర నుంచి ఆ ముగ్గురిని క్షేమంగా కాపాడిన పోలీసులు.. రెండు వాహనాల సీజ్ చేయడంతో పాటు మొత్తం 8 ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే తాజాగా భూమా అఖిల ప్రియను బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read:
ISRO Scientist Tapan Misra: ‘నాకు విషం పెట్టి చంపాలని చూశారు’… ఇస్రో శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు..