ఆయేషా మీరా హత్యకేసు నిందితుడు.. సత్యం బాబు పెళ్లి..!

| Edited By: Srinu

Jul 06, 2019 | 7:24 PM

ఆయేషా మీరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబు ఆలస్యంగానైనా వివాహం చేసుకున్నాడు. ఖమ్మంలో నిడారంబరంగా జరిగిన పెళ్లి కార్యక్రమంలో సమీప బంధువులు పాల్గొన్నారు. అయితే.. ఈ వీడియోను అధికారికంగా విడుదల చేయ్యక పోయినప్పటికీ.. సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహబూబా బాద్ జిల్లా చంద్రవెళ్లి మండలంలోని సింగిడి తండాకు చెందిన అమ్మాయితో ఈ పెళ్లి జరిగింది. ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని కొర్రగిరి పుణ్యక్షేత్రంలో యువతితో అతడి వివాహం జరిగింది. బంధువులు, సన్నిహితుల […]

ఆయేషా మీరా హత్యకేసు నిందితుడు.. సత్యం బాబు పెళ్లి..!
Follow us on

ఆయేషా మీరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబు ఆలస్యంగానైనా వివాహం చేసుకున్నాడు. ఖమ్మంలో నిడారంబరంగా జరిగిన పెళ్లి కార్యక్రమంలో సమీప బంధువులు పాల్గొన్నారు. అయితే.. ఈ వీడియోను అధికారికంగా విడుదల చేయ్యక పోయినప్పటికీ.. సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహబూబా బాద్ జిల్లా చంద్రవెళ్లి మండలంలోని సింగిడి తండాకు చెందిన అమ్మాయితో ఈ పెళ్లి జరిగింది. ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని కొర్రగిరి పుణ్యక్షేత్రంలో యువతితో అతడి వివాహం జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఆయేషా హత్యోదంతానికి ముందే తన మరదలితో వివాహం జరిగింది. కానీ, వ్యక్తిగత కారణాలతో సత్యంబాబును వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.

తొమ్మిదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు. హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో కొన్ని నెలల కిందట జైలు నుంచి విడుదలయ్యాడు. జైల్లో ఉండగానే తండ్రి మరణం, పెళ్లీడుకు వచ్చిన చెల్లెలు, తల్లికి వయసు మీద పడటం లాంటి సమస్యలతో సత్యంబాబు మానసిక సంక్షోభకు గురయ్యాడు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురు చూశాడు.