
శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పులు, 62 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శ్రీకాకుళంలో 17 మండలాలు, విజయనగరంలో 21 మండలాలు, పార్వతీపురం మన్యంలో 12 మండలాలు, అల్లూరిలో 2 మండలాలు, అనకాపల్లిలో 3 మండలాలు, కాకినాడలో 1 మండలం, తూర్పుగోదావరి 5 మండలాలు, ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 42.6 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా చక్రాయపేటలో 42.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.7 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 41.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 41.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో తీవ్రవడగాల్పులు, 20 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
Second Heatwave expected from April 15th in Andhra Pradesh and Telangana.. This time Coastal Andhra Pradesh ( Uttrandhra , Godavari, Krishna, Prakasam, Nellore & Rayalaseema belt set to reach 44- 46°C ) 🔥🔥
— Vizag Weatherman@AP (@VizagWeather247) April 10, 2024