ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APCOBలో 338 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు!
APCOB Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (APCOB) లో 338 స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు 07/08/2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభ జీతం రూ. 47,000/- ఉంటుంది.
APCOB Recruitment 2026 Telugu: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (APCOB) నుంచి నిరుద్యోగులకు ఒక చక్కటి శుభవార్త వెలువడింది. బ్యాంకులో వివిధ విభాగాల్లో 338 స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 24/07/2026
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07/08/2026
పోస్టుల వివరాలు, ఖాళీలు
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (APCOB)
పోస్టుల పేరు: స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్
మొత్తం పోస్టుల సంఖ్య: 338
ఉద్యోగ విధానం: పర్మనెంట్ జాబ్స్
విద్యా అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు ఆంగ్ల పరిజ్ఞానంతో పాటు స్థానిక భాష (తెలుగు) మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం (Computer Knowledge) తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు, వయస్సును 01.06.2026 నాటికి ప్రాతిపదికగా లెక్కించడం జరుగుతుంది. (నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది).
నెలసరి జీతం: ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం సుమారు రూ. 47,000/- వరకు ఉంటుంది.